
ప్రకృతితోనే మానవ మనుగడ
బాన్సువాడ: ప్రకృతితోనే మానవ మనుడగ సాధ్యమని వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. శుక్రవారం బాన్సువాడ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సబ్ కలెక్టర్ కిరణ్మయితో కలిసి మొక్కలు నాటారు. అంతకు ముందు ఆయన విద్యార్థులనుద్దేశించి మాట్లాడారు. 2015 కంటే ముందు రాష్ట్రంలో 21 శాతం చెట్లు ఉంటే తర్వాత కాలంలో 26 శాతానికి చేరిందని, భవిష్యత్‌లో 33 శాతం వరకు చెట్లు ఉంటేనే మానవ మనుగడ సాధ్యమని అన్నారు. మొక్కలు నాటడం ఎంత ముఖ్యమో వాటిని సంరక్షించే బాధ్యత అంతే ముఖ్యమన్నారు. పుట్టినప్పటి నుంచి మరణించే వరకు కట్టే అవసరం ఉంటుందని అన్నారు. తెలంగాణ భౌగోళిక విస్తీర్ణం 2 కోట్ల 75 లక్షల ఎకరాలు ఉందని, సరైన సమయంలో వర్షాలు పడాలంటే వాతావరణంలో సమతుల్యం ఉండాలని, అందుకనే రాష్ట్ర ప్రభుత్వం వన మహోత్సవం నిర్వహిస్తోందని అన్నారు. ఈ ఏడాది 18.02 కోట్ల మొక్కలు నాటాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని తెలిపారు. ప్రతి ఇంటికి ఆరు మొక్కలను పంపిణీ చేయాలన్నారు. విద్యార్థులే కాకుండా ఉపాధ్యాయులు, అధికారులు కూడా మొక్కలు నాటాలని సూచించారు. జిల్లా అటవీశాఖ అధికారిణి సునీత, ఎఫ్‌ఆర్‌వో అబీబ్, జిల్లా ఇంటర్ నోడల్ అధికారి సలాం, మున్సిపల్ మాజీ చైర్మన్ జంగం గంగాధర్, మున్సిపల్ కమిషనర్ శ్రీహరిరాజు, అధ్యాపకులు, నాయకులున్నారు.
విద్యార్థులతో కలిసి ప్రార్థన
కళాశాలలో మొక్కలు నాటేందుకు వచ్చిన పోచారం శ్రీనివాస్‌రెడ్డి విద్యార్థులతో కలిసి ప్రార్థన చేశారు. జాతీయ గీతాన్ని ఆలపించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..తాను ఇదే కళాశాలలో చదువుకున్నానని, తరగతితో ఫస్ట్ వచ్చేవాడినని గుర్తు చేశారు. కళాశాలకు వస్తున్నానని తాను పంచె కట్టుకుని రాకుండా ప్యాంటు చొక్కా వేసుకుని వచ్చానని సరదాగా వ్యాఖ్యానించారు.
ఏరియా ఆస్పత్రి పనుల పరిశీలన
బాన్సువాడ రూరల్: మండల కేంద్రంలోని కొత్తగా నిర్మిస్తున్న 100 పడకల ప్రభుత్వ ఏరియా ఆస్పత్రి భవన నిర్మాణ పనులను శుక్రవారం పోచారం శ్రీనివాస్‌రెడ్డి పరిశీలించారు. పాత ఆస్పత్రి భవనం శిఽథిలావస్థకు చేరడంతో దాన్ని తొలగించి రూ.37.50 కోట్లతో నూతన ఆస్పత్రి భవనం నిర్మిస్తున్నారు. పనులు నాణ్యతగా చేయించాలని అధికారులను ఆదేశించారు. నాయకులు అంజిరెడ్డి, కృష్ణారెడ్డి, ఎజాస్, లింగం, హకీమ్, సాయిలుయాదవ్ తదితరులు పాల్గొన్నారు.
వ్యవసాయ సలహాదారు
పోచారం శ్రీనివాస్‌రెడ్డి

ప్రకృతితోనే మానవ మనుగడ