సన్నం సరే.. దొడ్డు మాటేమిటి? | - | Sakshi
Sakshi News home page

సన్నం సరే.. దొడ్డు మాటేమిటి?

Jul 12 2025 9:45 AM | Updated on Jul 12 2025 9:45 AM

సన్నం సరే.. దొడ్డు మాటేమిటి?

సన్నం సరే.. దొడ్డు మాటేమిటి?

ఎల్లారెడ్డి: కామారెడ్డి జిల్లాలో 3 నెలల సన్నబి య్యం పంపిణీ విజయవంతంగా పూర్తయింది. కానీ రేషన్‌ షాపుల్లో ముక్కిపోతున్న దొడ్డు బి య్యాన్ని ఎప్పుడు స్వాధీనం చేసుకుంటారన్న ప్రశ్నకు సివిల్‌ సప్లయ్‌ అధికారుల వద్దే సమా ధానం లేదు. జూన్‌ నెల ఆసాంతం జరిగిన స న్న బియ్యం పంపిణీ కార్యక్రమం జిల్లాలో 93 శాతం పూర్తయింది. జిల్లాలోని 578 రేషన్‌ దు కాణాలకు 17,711.470 మెట్రిక్‌ టన్నుల సన్న బియ్యం మూడు నెలల కోటా కింద విడుదల చేయగా వీటిలో 16,471.667 మెట్రిక్‌ టన్నుల బియ్యాన్ని పంపిణీ చేశారు. అయితే రేషన్‌ దు కాణాలలో పంపిణీ జరగకుండా మిగిలిపోయి న దొడ్డు బియ్యాన్ని సన్న బియ్యం పంపిణీ కంటే ముందే స్వాధీనం చేసుకుంటామన్న సివిల్‌ సప్లయ్‌ శాఖ ఇప్పటి వరకు బియ్యం వాపస్‌ వి షయంపై ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో రేషన్‌ దుకాణాల నిర్వాహకులు ఆందోళన చెందుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రేషన్‌ దుకాణాలు, గోదాముల్లో కలిపి దాదాపు లక్ష మెట్రిక్‌ టన్నుల దొడ్డు బియ్యం నిల్వలు ఉన్నట్లు అధి కారుల అంచనా. దీని విలువ దాదాపు రూ. 400 కోట్లపై చిలుకు ఉంటుందని అధికారులే అంటున్నారు. మార్చి నుంచి ఈ నిల్వలు అలా గే ముక్కి పోతున్నాయి.

ఎక్కడ నిల్వ చేసుకోవాలి..?

జూన్‌ 1కి ముందున్న దొడ్డు బియ్యం నిల్వలు దుకాణాల్లో అలాగే ఉండటంతో మూడు నెలల సన్న బియ్యం కోటాను ఎక్కడ పెట్టుకోవాలో తెలియక రేషన్‌ డీలర్లు ఇబ్బంది పడ్డారు. మార్చి నుంచి రేషన్‌ దుకాణాలు, గోదాముల్లో ఉన్న బియ్యం ప్రస్తుతం గడ్డలు కట్టి పురుగులు పట్టి పనికి రాకుండా తయారైంది. ఈ చెడిపోతున్న బియ్యం కారణంగా సన్న బియ్యానికి కూడా పురుగులు పడుతున్నాయి. గతంలో ఇలాగే కందిపప్పును పంపిణీ చేయగా మిగిలిపోయిన పప్పు సివిల్‌ సప్లయ్‌ అధికారులు వెనక్కి తీసుకుంటామని తీవ్ర జాప్యం చేశారు. దుకాణాల్లో మిగిలిపోయిన పప్పు పురుగులు పట్టి దుర్వాసన వస్తుండటంతో దుకాణదారులు బయట పారబోయాల్సి వచ్చింది. చెడిపోయిన పప్పును పారబోసిన కొద్ది రోజులకు అధికారులు మిగిలిపోయిన పప్పు నిల్వలను వెనక్కి తీసుకోవడానికి రావడంతో.. పారబోసిన పప్పును మళ్లీ తేలాక మార్కెట్‌ నుంచి కందిపప్పును కొని అధికారులకు రేషన్‌ దుకాణ నిర్వాహకులు అప్పగించారు. ఇప్పుడు కూడా గడ్డలు కట్టి పురుగులు పట్టిన బియ్యాన్ని ఏమి చేయాలో తెలియక మదనపడుతున్నారు.

దొడ్డు బియ్యం ఎక్కడ ఉంచాలి?

రేషన్‌ దుకాణాల్లో గడ్డలు కట్టి, పురుగులు పట్టి చెడిపోతున్న దొడ్డు బియ్యం నిల్వలను ఎక్కడ ఉంచాలో అర్థం కావడం లేదు. గతంలో ఇలాగే చెడిపోయిన కందిపప్పును బయట పారబోస్తే అధికారులు మిగిలిపోయిన పప్పును తమకు వెనక్కి ఇవ్వాలని ఆదేశించారు. సొంత ఖర్చుతో కంది పప్పు కొని అధికారులకు అప్పగించాం. ప్రభుత్వం దొడ్డు బియ్యం నిల్వల స్వాధీనం విషయంలో త్వరగా నిర్ణయం తీసుకోవాలి.

– నాగం సురేందర్‌, జిల్లా రేషన్‌ డీలర్ల సంఘం అధ్యక్షుడు

ఆదేశాలు రావాల్సి ఉంది ..

రేషన్‌ దుకాణాలు, గోదాముల్లో మార్చి నెల నుంచి నిల్వ ఉన్న దొడ్డు బియ్యాన్ని స్వాధీనం చేసుకునే విషయంలో ప్రభుత్వం నుంచి ఆదేశా లు రావాల్సి ఉంది. ప్రభుత్వ ఉత్తర్వులు రాగానే దొడ్డు బియ్యాన్ని స్వాధీనం చేసుకుంటాం.

– మల్లికార్జున్‌,

జిల్లా పౌర సరఫరాల అధికారి

రేషన్‌ దుకాణాల్లో ముక్కిపోతున్న

దొడ్డు బియ్యం నిల్వలు

త్వరగా నిర్ణయం తీసుకోవాలని

కోరుతున్న రేషన్‌ డీలర్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement