
అటవీ ప్రాంతంలో చెట్ల నరికివేత
ఎల్లారెడ్డి: మండలంలోని రత్నాపూర్ అటవీ ప్రాంతంలో గుర్తుతెలియని దుండగులు అక్రమంగా చెట్లను నరికి వేస్తున్నారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అటవీప్రాంతంలో తరచు చెట్లను నరికి వేయడంతో ఇటీవల అటవీశాఖ అధికారులు వచ్చి, పరిశీలించారని, కానీ చెట్లు నరికిన వారిని గుర్తించ లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి అటవీ ప్రాంతంలో చెట్లు నరకకుండా నిఘా పెంచాలని వారు కోరుతున్నారు.
మైనర్లు వాహనాలు నడపొద్దు
లింగంపేట(ఎల్లారెడ్డి): మైనర్లు వాహనాలను నడపడానికి ఇస్తే వారిపై చర్యలు తీసుకుంటామని ఎస్సై దీపక్‌కుమార్ అన్నారు. మండలంలోని లింగంపల్లి చౌరస్తా వద్ద శనివారం ఎస్సై దీపక్‌కుమార్ సిబ్బందితో కలిసి వాహనాల తనిఖీ నిర్వహించారు. ఈసందర్భంగా పెండింగ్‌లో ఉన్న చలాన్లు వసూలు చేసినట్లు తెలిపారు. అలాగే ఒక డ్రంకెన్‌డ్రైవ్ కేసు నమో దు చేసినట్లు తెలిపారు. ఏఎస్సై మధుసూదన్ కానిస్టేబుల్ రాజు, మురళి, జయ్, లక్ష్మన్, రవి, మదన్‌లాల్ పాల్గొన్నారు.
వామ్మో..146 చక్రాల లారీ
మద్నూర్(జుక్కల్): మండల కేంద్రం మీదుగా జాతీయ రహదారిపై శనివారం రెండు భారీ వాహనాలు వెళ్లడంతో ప్రజలు ఆసక్తిగా తిలకించారు. సాధారణంగా లారీకి 12, 14, 16 చక్రా లు ఉండడం చూశాం. కానీ హైదారాబాద్ నుంచి మద్నూర్ మీదుగా మహరాష్ట్రలోని నాందేడ్ పట్టణానికి భారీ ఎలక్ట్రానిక్ మిషన్ లోడ్‌తో వె ళ్తున్న లారీకి 146 చక్రాలున్నాయి. పది రోజుల క్రితం బయలుదేరామని మరో వారం రోజుల్లో నాందేడ్‌కు చేరుకుంటామని డ్రైవర్లు తెలిపారు.
విద్యుత్ సమస్యలను
వెంటనే పరిష్కరించండి
మాచారెడ్డి: ఫరిద్‌పేట సబ్‌స్టేషన్ పరిధిలో వి ద్యుత్ సమస్యలను పరిష్కరించాలని అన్నదాతలు డిమాండ్ చేశారు. ఈమేరకు శనివారం పాల్వంచ మండల పరిధిలోని ఫరిద్‌పేట సబ్ స్టేషన్‌ను రైతులు ముట్టడించారు. అనంతరం పలువురు రైతులు మాట్లాడుతూ.. నాలుగు రో జులుగా విద్యుత్ సమస్యలతో సతమతమవు తున్నా తమను ఎవరూ పట్టించుకోవడం లేదన్నారు. వరి నాట్లు వేసే సమయంలో విద్యుత్ కోతలను విధించడం ఎంతవరకు సమంజస మని ప్రశ్నించారు. ట్రాన్స్‌కో ఏఈ జ్యోతి రైతులతో ఫోన్‌లో మాట్లాడి సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో రైతులు శాంతించారు. తదుపరి సబ్‌స్టేషన్ సిబ్బందికి వినతి పత్రం అందజేశారు.

అటవీ ప్రాంతంలో చెట్ల నరికివేత

అటవీ ప్రాంతంలో చెట్ల నరికివేత

అటవీ ప్రాంతంలో చెట్ల నరికివేత