23 దేశాల కరెన్సీ.. 25 దేశాల స్టాంప్స్‌ సేకరణ | - | Sakshi
Sakshi News home page

23 దేశాల కరెన్సీ.. 25 దేశాల స్టాంప్స్‌ సేకరణ

Jul 14 2025 5:19 AM | Updated on Jul 14 2025 5:19 AM

23 దే

23 దేశాల కరెన్సీ.. 25 దేశాల స్టాంప్స్‌ సేకరణ

డిచ్‌పల్లి: అతడి వృత్తి పోలీసు.. ప్రవృత్తి వివిధ దేశాల నాణేలు.. కరెన్సీ, స్టాంపుల సేకరణ. ఈ సేకరణలో అతడి భార్య సహకారం ఎంతో ఉంది. వివరాలిలా ఉన్నాయి. నిజామాబాద్‌ జిల్లా డిచ్‌పల్లి మండలంలోని తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక పోలీసు ఏడో బెటాలియన్‌లో గుట్ట గంగాధర్‌ హెడ్‌ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నారు. గంగాధర్‌ భార్య త్రివేణి గణిత ఉపాధ్యాయురాలిగా పని చేస్తోంది. ఇద్దరికీ స్టాంపులు, నాణేలు, కరెన్సీల సేకరణ అంటే ఇష్టం. ఈ దంపతుల కుటుంబ సభ్యులలో పలువురు విదేశాలకు వలస వెళ్లారు. వారి ద్వారా అక్కడి దేశాల స్టాంపులు, నాణేలు, కరెన్సీ సేకరించారు. అలాగే స్నేహితులు, తెలిసిన వారి ద్వారా వివిధ దేశాల స్టాంపులు, నాణేలు, కరెన్సీ సేకరించారు. ఇలా 2003 నుంచి 23 దేశాల నాణేలు, కరెన్సీతో పాటు 25 దేశాలకు చెందిన స్టాంపులు సేకరించారు. సేకరించిన నాణేలలో కాకతీయుల కాలంతో పాటు 1939 సంవత్సరం నిజాం కాలం నాటి నాణేలు, రూపాయలు ఉన్నాయి. వీరు సేకరించిన నాణేలు, కరెన్సీలలో భారతదేశం తో పాటు యూఎస్‌ఏ, యూకే, మలేషియా, జర్మనీ, ఫ్రాన్స్‌, సింగపూర్‌, జోర్డాన్‌, టర్కీ, ఇటలీ, పొలాండ్‌, ఫిలిఫ్సీన్స్‌, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, ఇండోనే షియా, ఖతర్‌, బహ్రెయిన్‌, యూఏఈ, కువైట్‌, సౌదీ అరేబియా తదితర దేశాలకు చెందినవి ఉన్నాయి. స్టాంపులలో ఇండియాతో పాటు పాకిస్తాన్‌, బంగ్లాదేశ్‌, నేపాల్‌, యూఎస్‌ఏ, యూఏఈ, సౌదీ అరేబియా, ఒమన్‌, టర్కీ, మాల్టా, సింగపూర్‌, ఈజిఫ్ట్‌, ఫిలిఫ్పిన్స్‌, ఇటలీ తదితర దేశాలవి ఉన్నాయి. వీటి సేకరణ కోసం గంగాధర్‌ దంపతులు చాలా మంది వ్యక్తులను కలిశారు. పోలీసు ఉద్యోగం రాకముందు గంగాధర్‌ కూడా ఉపాధ్యాయ వృత్తిపై ఇష్టంతో ప్రైవేట్‌ టీచర్‌గా పని చేశారు. అప్పుడే ఆయనకు ఈ సేకరణపై ఇష్టం ఏర్పడింది. గత చరిత్ర, పాలకుల వైభవాలకు గుర్తు అయిన కాకతీయ, నిజాం కాలం నాటి నాణేల సేకరణతో మొదలుపెట్టాడు. ప్రస్తుతం తమ ఇంటికి ట్యూషన్‌కు వచ్చే బాల, బాలికలకు వీటి గురించి వివరిస్తారు.

కాకతీయులు, నిజాం కాలం

నాటి నాణేలు

బెటాలియన్‌ హెడ్‌ కానిస్టేబుల్‌

గుట్ట గంగాధర్‌ దంపతులు

23 దేశాల కరెన్సీ.. 25 దేశాల స్టాంప్స్‌ సేకరణ1
1/5

23 దేశాల కరెన్సీ.. 25 దేశాల స్టాంప్స్‌ సేకరణ

23 దేశాల కరెన్సీ.. 25 దేశాల స్టాంప్స్‌ సేకరణ2
2/5

23 దేశాల కరెన్సీ.. 25 దేశాల స్టాంప్స్‌ సేకరణ

23 దేశాల కరెన్సీ.. 25 దేశాల స్టాంప్స్‌ సేకరణ3
3/5

23 దేశాల కరెన్సీ.. 25 దేశాల స్టాంప్స్‌ సేకరణ

23 దేశాల కరెన్సీ.. 25 దేశాల స్టాంప్స్‌ సేకరణ4
4/5

23 దేశాల కరెన్సీ.. 25 దేశాల స్టాంప్స్‌ సేకరణ

23 దేశాల కరెన్సీ.. 25 దేశాల స్టాంప్స్‌ సేకరణ5
5/5

23 దేశాల కరెన్సీ.. 25 దేశాల స్టాంప్స్‌ సేకరణ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement