
పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి
మాచారెడ్డి : పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని డీఎంహెచ్‌వో చంద్రశేఖర్ ప్రజ లకు సూచించారు. ఆదివారం పాల్వంచ మండలం భవానీపేట గ్రామ పంచాయతీ పరిధిలోని కిసాన్‌నగర్‌ను సందర్శించారు. గ్రామంలో డెంగీ విజృంభించి 20 మందికి పాజిటివ్ వచ్చిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా డీఎంహెచ్‌వో గ్రామాన్ని సందర్శించారు. సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించారు. డెంగీ బాధితులు ఆందోళనకు గురికావొద్దన్నారు. ఆయన వెంట మాచారెడ్డి వైద్యాధికారి ఆద ర్శ్, సిబ్బంది ఉన్నారు.
నాగారంలో
చిరుత సంచారం
నిజామాబాద్ సిటీ: నగరంలోని నాగారం శివారులో ఆదివారం చిరుత సంచరించింది. సాయంత్రం 6 గంటల సమయంలో డంపింగ్ యార్డు సమీపంలోని 300 క్వార్టర్స్ కాలనీ వాటర్ ట్యాంక్ వద్ద చిరుతపులిని స్థానికులు గమనించారు. కొందరు తమ ఫోన్‌లలో ఫొటోలు, వీడియోలు తీశారు. కాలనీ సమీపంలోకి చిరుత రావడంతో స్థానికులు భయభ్రాంతులకు గురవుతున్నారు. అటవీశాఖ అధికారులకు ఫోన్ చేసినా వారు స్పందించడం లేదని తెలిపారు.
నేరస్తులకు శిక్ష పడేలా
కృషి చేయాలి
ఖలీల్‌వాడి: ప్రజలకు న్యాయం అందించడంలో కోర్టు డ్యూటీలో ఉండే పోలీసు సిబ్బంది పాత్ర కీలకమని సీపీ సాయి చైతన్య అన్నా రు. కోర్టు సమయానికి హాజరై సాక్షులను సురక్షితంగా హాజరుపర్చి నేరస్తులకు శిక్ష పడేలా కృషి చేయాలని సూచించారు. నగరంలోని పోలీస్ కమాండ్ కంట్రోల్ హాల్‌లో కోర్టు డ్యూటీ కానిస్టేబుళ్లతో ఆదివారం సీపీ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ ప్రజలకు పోలీస్ శాఖపై నమ్మకాన్ని పెంచేలా విధులు నిర్వర్తించాలన్నారు. నైతిక విలువలు పోలీసుల క్రమశిక్షణను ప్రతిబింబిస్తాయన్నారు. నిజాయితీ, నిబద్ధతతో సేవలందించాలన్నారు. ప్రధాన కేసులలో ఎస్సై, సీఐ, ఏసీపీలతో బ్రీఫింగ్ చేయించాలన్నారు. సమన్లు, వారెంట్స్ ఎప్పటికప్పుడు ఇవ్వాలని, కోర్టులో చార్జ్‌షీట్ వేసే ముందు అన్ని పత్రాలు జాగ్రత్తగా చూసుకోవాలని సూచించారు. సమావేశంలో అదనపు పోలీస్ కమిషనర్ (అడ్మిన్) బస్వా రెడ్డి, కోర్ట్ లైజన్ ఆఫీసర్ శ్యామ్ కుమార్, ఐటీ కోర్ సిబ్బంది పాల్గొన్నారు.

పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి

పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి