
సాగు పనుల్లో భోజన విరామం
భిక్కనూరు: మండలంలో వర్షకాల వ్యవసాయ సాగు పనుల జోరుగా కొనసాగుతున్నాయి. పనుల్లో మహిళ కూలీలు, రైతులు అధికంగా హాజరవుతున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు పనులు కొనసాగుతుండటంతో వారు మధ్యాహ్న భోజనాన్ని సద్దులు కట్టుకొని, పని ప్రదేశాల్లోనే భోజనం చేస్తున్నారు. భిక్కనూరు మండల కేంద్రం సమీపంలో మహిళ వ్యవసాయ కూలీలు వరి నాట్లు వేసి, మధ్యాహ్నం పొలం గట్టు పక్కన ఉన్న రోడ్డుపై కూర్చుండి భోజనం చేశారు. తోటివారితో ముచ్చట్లు పెట్టుకుంటూ పని అలసటను మర్చిపోయారు. ఈ చిత్రాన్ని ‘సాక్షి’ క్లిక్‌మనిపించింది.