
ఆర్మూర్‌లో అంతర్భాగమైన రాజస్థానీలు
మీకు తెలుసా?
మైలు రాళ్లకు రంగులు వేటికి గుర్తులో తెలుసా?
సమాచారం..
ఆర్మూర్ పట్టణంలో అత్యధిక జనాభా గల ఖత్రి (క్షత్రియ సమాజ్) కులస్తుల ప్రస్థానం ఆసక్తికరంగా ఉంటుంది. గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాల సరిహద్దుల్లో గల మండవ్‌ఘడ్ ఖత్రిల పుట్టినిల్లు.
● పట్టు చేనేత వస్త్రాలను నేస్తూ గుజరాత్, రాజస్థాన్‌లలో సరఫరా చేసేవారు. అప్పట్లో పట్టు వస్త్రాలకు ఉన్న డిమాండ్ మేరకు ఖత్రిలు ఉపాధి కోసం 500 సంవత్సరాల క్రితం ఉత్తరప్రదేశ్, పంజాబ్, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక తదితర రాష్ట్రాలకు వెళ్లారు.
● ఖత్రిలు మాట్లాడే భాషకు లిపి లేదు.
● పట్టు వస్త్రాల నేత పనే జీవనాధారంగా కొనసాగించిన ఖత్రి కులస్తులకు ఉపాధి కరువవడంతో ఇతర వ్యాపారాల్లో స్థిరపడ్డారు.
● 64 వేల ఆర్మూర్ పట్టణ జనాభాలో 16 వేలకు పైచిలుకు ఖత్రి కులస్థులు ఉన్నారు.
● ఓటర్లు సైతం 10 వేలకు పైగా ఉండటంతో పరిపాలన, రాజకీయ రంగాల్లో సైతం వారికి ప్రత్యేక స్థానం ఉంది. పట్టు నేత ప్రధాన కులవృత్తిగా ఉన్న ఈ ఖత్రి కులస్థులను క్షత్రియులుగా కూడా సంబోధిస్తారు.
● పట్టు నేయడంతో పట్కరీలు అనే మరో పేరు సైతం వీరికి వచ్చింది.
● వీరు శివుడి భక్తుడైన సహస్త్రార్జునుని పూ జిస్తారు. ఆయన వంశీకులుగా దేశంలోని అన్ని ప్రాంతాల్లో విస్తరించారు. – ఆర్మూర్
ఖలీల్‌వాడి : మనం ప్రయాణించే సమయంలో రోడ్డు పక్కన మైలు రాళ్లు కనిపిస్తుంటాయి. అన్నింటికీ ఒకే రంగు కాకుండా వివిధ రకాల రంగులను చూస్తాం. రోడ్లను బాధ్యతలు చూసే శాఖలను ఈ రంగులు సూచిస్తాయి. పసుపు, తెలుపు రంగులో ఉంటే జాతీయ రహదారి(ఎన్‌హెచ్), ఆకుపచ్చ, తెలుపు వర్ణంలో ఉంటే స్టేట్ (రాష్ట్ర) రహదారి, నలుపు, తెలుపులో ఉంటే నగర, జిల్లా రహదారి, కాషాయం, తెలుపు రంగు ఉంటే గ్రామీణ రోడ్లుగా గుర్తించాలి. రెండు గ్రామాలను కలుపుతూ ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన ద్వారా వేసే రోడ్లకు కూడా కాషాయం, తెలుపు రంగు వేస్తారు.

ఆర్మూర్‌లో అంతర్భాగమైన రాజస్థానీలు

ఆర్మూర్‌లో అంతర్భాగమైన రాజస్థానీలు

ఆర్మూర్‌లో అంతర్భాగమైన రాజస్థానీలు