
కూరగాయల సాగుతో నిత్య ఆదాయం
ఎల్లారెడ్డిరూరల్: వ్యవసాయంతో పాటు కూరగాయలను సాగు చేస్తు నిత్యం ఆదాయం పొందుతున్నాడు గిరిజన రైతు పాండు. అర ఎకరం పొలంలో బెండ, వంకాయ, బీరకాయ, పాలకూర, కొత్తిమీర పంటలను సాగు చేస్తు లాభాలను అర్జిస్తూ, ఇతర రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు.
సాగుతోపాటు మారెట్లో విక్రయం..
ఎల్లారెడ్డి మండలంలోని జిత్యాతండాకు చెందిన పాండు తనకున్న రెండెకరాల పొలంలో అర ఎకరం కేవలం కూరగాయల సాగుకు మాత్రమే కేటాయించాడు. ఏడాది మొత్తం వివిధ రకాలైన కూరగా యలు, ఆకు కూరలు పంటలను సాగు చేస్తున్నాడు. తక్కువ మోతాదులో ఎరువులను వాడుతూ పంటలను సాగు చేస్తు ఆదర్శంగా నిలుస్తున్నాడు. ఉద యం నుంచి మధ్యాహ్నం వరకు కూరగాయలను తెంపడం, కలపు తొలగించడం పనులు పూర్తయిన అనంతరం మార్కెట్‌కు వెళ్లి, కూరగాయలను విక్ర యిస్తున్నారు. దళారులకు విక్రయించకుండా వారే విక్రయించడంతో అధిక లాభాలను అర్జిస్తున్నారు. అర ఎకరంలో అతడు భార్యతోపాటు కూరగాయల సాగు చేస్తూ ఏటా రెండు నుంచి రెండున్నర లక్షల రూపాయల ఆదాయాన్ని అర్జిస్తున్నారు.
అర ఎకరంలో పలు రకాలను
పండిస్తూ లాభాలను ఆర్జిస్తున్న
గిరిజన రైతు పాండు
కూరగాయల సాగుకే ప్రాధాన్యత ఇస్తా..
వ్యవసాయం కంటే కూరగాయల సాగు అంటేనే నాకు చాలా ఇష్టం. దీంతో నిత్యం పొలంలోకి వెళ్లి కూరగాయలను తెంపడం, వాటికి నీరు అందించడం లాంటి పనులను నా భార్యతో కలిసి చేస్తాం. కూరగాయలను కోసిన అనంతరం సాయంత్రం మార్కెట్‌కు వెళ్లి విక్రయిస్తాం.
– పాండు, రైతు, జిత్యాతండా

కూరగాయల సాగుతో నిత్య ఆదాయం

కూరగాయల సాగుతో నిత్య ఆదాయం