వర్షంలో డ్రైవింగ్‌ జాగ్రత్త! | - | Sakshi
Sakshi News home page

వర్షంలో డ్రైవింగ్‌ జాగ్రత్త!

Jul 13 2025 7:41 AM | Updated on Jul 13 2025 7:41 AM

వర్షంలో డ్రైవింగ్‌ జాగ్రత్త!

వర్షంలో డ్రైవింగ్‌ జాగ్రత్త!

ఖలీల్‌వాడి: వర్షాకాలంలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా అవుతుంటాయి. వర్షంకు వాహనాలపై వెళ్లేటప్పుడు స్కిడ్‌ అయి పడిపోయి మృతి చెందిన ఘటనలు జిల్లాలో ఉన్నాయి. బస్సులు, కార్లు, ద్విచక్రవాహనాలపై వెళ్లేటప్పుడు వాహనాదారులు జాగ్రత్తలు పాటిస్తే ప్రమాదాలు నివారించడానికి అవకాశం ఉంటుంది. వర్షాకాలంలో వర్షం కురిసే సమయంలో అతివేగంగా వెళ్లడంతో జిల్లాలో ప్రతియేటా పదుల సంఖ్యలో వాహనదారులు మృతి చెందుతున్నట్లు పోలీసు వర్గాల ద్వారా తెలుస్తోంది. ఈ రోడ్డు ప్రమాదాల్లో భారీ వాహనాలు, కార్లు, ద్విచక్రవాహనాలపై వెళ్లే వారు ప్రమాదాలకు గురై, మృతి చెందుతున్నారు. ఎక్కువగా ద్విచక్ర వాహనాదారులే వర్షాకాలంలో ప్రమాదాలకు గురై, మృత్యువాత పడిన ఘటనలు ఉన్నాయి. వర్షంలో తొందరగా గమ్యస్థానాలకు వెళ్లడానికి స్పీడ్‌గా వెళ్లిన ద్విచక్ర వాహనదారులు వాహనం అదుపుతప్పి ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉంది. దీంతోపాటు రోడ్డుపై గాని బురదలో గాని బండ్లు స్కిడ్‌ కావడంతో పడిపోయి ప్రమాదానికి గురవుతున్నారు. రోడ్లపై ఉన్న గుంతల్లో నీరు నిలిచిఉండగా అందులోనుంచి వెళ్లకపోవడమే మంచిది.

ప్రయాణంలో ఇవి పాటించాలి..

జిల్లాలో ఏటా వర్షాకాలంలో

10 నుంచి 15 మంది మృత్యువాత

వాహనాల వేగం తగ్గిస్తేనే

ప్రమాదాల నివారణ

దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు వాహనానికి కావాల్సిన పెట్రోల్‌ ఎంత అవసరం అవుతుందో అంతమేర ముందుగానే పోసుకోవాలి. దీనితోపాటు టైర్లలో గాలిని చెక్‌ చేసుకోవాలి. వాహనంను బట్టి 30 నుంచి 35 పీఎస్సై వరకు గాలి చూసుకోవాలి.

ప్రతి వాహనం 150 నుంచి 200 కిలోమీటర్ల వెళ్లిన తర్వాత వాహనాలను 5 నిమిషాలపాటు ఆపాల్సి ఉంటుంది. దీంతో డ్రైవర్లు కొంత సేదతీరుతుంటారు.

వర్షంలో వాహనంతో స్పీడ్‌గా వెళ్తే ప్రమాదాలు జరుగుతాయి. వర్షాలకు వాహనాలు స్కిడ్‌ కావడంతోపాటు డ్రైవర్‌ చేతిలో నుంచి కంట్రోల్‌ తప్పుతాయి.

వర్షకాలంలో ఆర్టీసీ బస్సులు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వెళ్లాలి. అలాగే కార్లు, ఇతర వాహనాలు 80 కిలో మీటర్ల కంటే ఎక్కువగా వెళ్లరాదు. ద్విచక్రవాహనదారులు 40 కిలోమీటర్ల వేగం కంటే ఎక్కువగా వెళ్లరాదు.

నాలుగు టైర్ల వాహనాదారులు ముందు ఉండే గ్లాస్‌తోపాటు వైపర్లు మంచిగా ఉంచుకునేలా చూడాలి.

వాహనాల అద్దాలు బాగుంటేనే వర్షంలో వెళ్లేటప్పుడు ముందు కనిపించే వాహనాలు, రోడ్డు చూడటానికి అవకాశం ఉంటుంది.

అలాగే వాహనం వెనుక, పక్కన వచ్చే వాహనాలను చూడటానికి సైడ్‌ మిర్రర్స్‌ బాగుండాలి. దీంతోపాటు డ్రైవర్‌ తోపాటు అందులో ప్రయాణించేవారు తప్పనిసరిగా సీట్‌బెల్ట్‌ తప్పనిసరిగా పెట్టుకోవాలి.

నాలుగు టైర్ల వాహనాలకు తప్పనిసరిగా వీల్‌ అలైట్‌మెంట్‌, బ్యాలెన్సింగ్‌ అనేది చూసుకోవాలి. ఇంజిన్‌ఆయిల్‌, కూలెంట్‌, బ్రేక్‌ ఆయిల్‌ ఎప్పటికప్పడు పరిశీలించుకోవాలి.

స్పీడ్‌గా నడపొద్దు..

వర్షాకాలంలో వాహనాదారులు స్పీడ్‌గా వెళ్లవద్దు. వర్షం పడినప్పుడు రోడ్లపై ఉన్న గుంతల్లో నీరు నిలిచి ప్రమాదాలు జరుగుతాయి. అక్కడ జాగ్రత్త వహించాలి. వాహనాలపై వెళ్లేవారు తమ వాహనాల కండిషన్‌ను చూసుకోవాలి. కార్లు, ఇతర వాహనాదారులు సీట్‌బెల్ట్‌తోతోపాటు బ్రేక్‌లు, వైపర్లు, ముందు గ్లాస్‌, సైడ్‌ మిర్రర్లు, లైట్లు మంచిగా ఉంచుకోవాలి.

– ప్రసాద్‌, ట్రాఫిక్‌ సీఐ, నిజామాబాద్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement