
పోలీస్ డ్యూటీ మీట్‌లో జిల్లాకు 11 పతకాలు
● ఎస్పీ రాజేష్ చంద్ర
కామారెడ్డి క్రైం: కరీంనగర్‌లో ఈ నెల 7, 8 తేదీల్లో జరిగిన 2వ జోనల్ పోలీస్ డ్యూటీ మీట్‌లో జిల్లాకు 11 పతకాలు దక్కినట్లు ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు. పతకాలు సాధించిన పోలీసు అధికారులు, సిబ్బంది జిల్లా పోలీసు కార్యాలయంలో శుక్రవారం ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. భవిష్యత్తులో జరిగే రాష్ట్ర, జాతీయ స్థాయి పోలీస్ డ్యూటీ మీట్‌లలో కూడా పతకాలు సాధించాలని ఆకాంక్షించారు. పోలీసు సిబ్బంది తమ వృత్తి నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడానికి డ్యూటీ మీట్ ఎంతగానో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. పతకాలు సాధించిన వారికి రివార్డులను అందజేసి అభినందించారు. ఏఆర్ సీఐలు సంతోష్ కుమార్, నవీన్ కుమార్, సిబ్బంది పాల్గొన్నారు.
ప్రతిభ చూపిన గాంధారి ఎస్సై..
గాంధారి ఎస్సైగా పని చేస్తున్న ఆంజనేయులు పత కాల వేటలో ముందున్నారు. కేసుల విచారణలో శా సీ్త్రయ వినియోగానికి(లిఫ్టింగ్, ప్యాకింగ్, ఫింగర్ ప్రింట్స్ ఫార్వర్డ్, నేర స్థల ఫొటోగ్రఫీ) సంబంధించిన అంశాల్లో 3 బంగారు, 2 వెండి పతకాలు సా ధించారు. మద్నూర్ ఎస్సై విజయ్ ఫోరెన్సిక్, ఫొ టోగ్రఫీ, ఫింగర్ ప్రింట్ సైన్స్‌లలో 2 వెండి పతకా లు సాధించారు. బిచ్కుంద రైటర్ లక్ష్మీనారాయణ కు ఉత్తమ దర్యాప్తు(రైటర్) పతకం దక్కింది. కంప్యూటర్‌పై అవగాహన, విధ్వంసకాల విచ్ఛిన్నంపై తనిఖీలు తదితర అంశాల్లో రాజంపేట కానిస్టేబుల్ చిరంజీవికి కాంస్యం, ఏఆర్ కానిస్టేబుళ్లు రామచంద్రం, ఎల్లారెడ్డిలకు వెండి పతకాలు లభించాయి.