
జనాభా పెరుగుదలను నియంత్రించాలి
● డీఎంహెచ్‌వో చంద్రశేఖర్
కామారెడ్డి టౌన్: జనాభా పెరుగుదలను నియంత్రించాలని డీఎంహెచ్‌వో చంద్రశేఖర్‌రెడ్డి అన్నారు. ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా శుక్రవారం జిల్లా కేంద్రంలోని రాజీవ్‌నగర్‌కాలనీ పీహెచ్‌సీలో కార్యక్రమం నిర్వహించారు. అంతకు ముందు పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. జనాభా వల్ల కలిగే సమస్యలపై, గర్భధారణ సమయ నిర్ణయం, సురక్షిత ప్రసవం గురించి చేపట్టవలసిన చర్యలు, కుటుంబ నియంత్రణ శాశ్వత, తాత్కాలిక పద్ధతుల గురించి ప్రజల్లో అవగాహన కల్పించాలని డీఎంహెచ్‌వో సూచించారు. ఎన్‌హెచ్‌ఎం ప్రోగ్రాం ఆఫీసర్ రాధిక, ఎంసీహెచ్ ప్రోగ్రాం అధికారి డాక్టర్ అనురాధ, మెడికల్ ఆఫీసర్ సాయి ఈశ్వరి, చలపతి, రమణ, మమత, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
ప్రభుత్వ ఆస్పత్రులకు కాయకల్ప అవార్డులు
కామారెడ్డి టౌన్ : రాష్ట్ర వైద్యారోగ్య కుటుంబ సంక్షేమ శాఖ తాజాగా ప్రభుత్వ ఆస్పత్రులకు కాయకల్ప అవార్డులను ప్రకటించింది. జిల్లాలోని పలు ప్రభుత్వ ఆస్పతులకు అవార్డులు వచ్చాయి. ఏరియా ఆస్పత్రి విభాగంలో బాన్సువాడ ఆస్పత్రికి రాష్ట్ర స్థాయిలో 84.61 మార్కులతో 19వ స్థానంలో నిలిచింది. అవార్డుతో పాటు రూ.లక్ష నగదు దక్కించుకుంది. పీహెచ్‌సీలలో రాజీవ్‌నగర్ కాలనీ యూపీహెచ్‌సీ ఉత్తమ సేవా అవార్డుతో పాటు రూ.13,35,000 దక్కించుకుంది. ఉత్తమ పీహెచ్‌సీగా లింగంపేట రూ.2 లక్షల నగదు, అలాగే మత్మల్, హన్మాజీపేట్, బీబీపేట, మాచారెడ్డి, దోంగ్ల్లీ, పుల్కల్ పీహెచ్‌సీలు ప్రంశసా అవార్డులను అందుకోగా ఒక్కో పీహెచ్‌సీకి రూ. 50 వేల చొప్పున నగదు అవార్డును ప్రకటించారు. ఈ మేరకు డీఎంహెచ్‌వో చంద్రశేఖర్, డీసీహెచ్‌ఎస్ విజయలక్ష్మిలు అవార్డు అందుకున్న వైద్యులు, సిబ్బందిని అభినందించారు.
ప్రధానమంత్రి జాతీయ శిక్షణ మేళా
కామారెడ్డి టౌన్: జిల్లా కేంద్రంలోని శ్రావణి ఐటీఐలో ఈ నెల 14న ప్రధాన మంత్రి జాతీ య శిక్షణ మేళా నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాస్ శుక్రవారం తెలిపారు. ఐటీఐ పూర్తి చేసిన అభ్యర్థులు తమ ఒరిజినల్, జిరాక్స్ ప్రతులతో జిల్లా కేంద్రంలోని కళాశాలలో హాజరుకావాలని వెల్లడించారు. ప్రముఖ కంపెనీలు ఉద్యోగ అవకాశాల కోసం ఈ మేళా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.