
నేనేమి చేశాను పాపం.. నాకేమిటీ శిక్ష?
● పుట్టిన ఆడ బిడ్డను వదిలి
వెళ్లిన గుర్తుతెలియని వ్యక్తులు
● బాల సంరక్షణ కేంద్రానికి తరలింపు
బిచ్కుంద(జుక్కల్) : భూమి మీద పడి ఎన్నో గంటలు గడవనే లేదు. ఒళ్లంతా పురిటి రక్తపు మరకలు..బొడ్డు తాడు సరిగ్గా కోయనేలేదు. అమ్మ ఒడిలో ఉండాల్సిన శిశువు, ఎక్కడో బ్రిడ్జి వద్ద పడేసిన అమానుష ఘటన బిచ్కుంద పరిధిలో శుక్రవారం చోటుచేసుకుంది. నిర్మానుష్య ప్రదేశంలో వదిలేసిన ఆ శిశువును చూసి స్థానికులు కన్నీటిపర్యంతమయ్యారు. వివరాలు.. బిచ్కుంద– బాన్సువాడ రోడ్డులో శుక్రవారం ఉద యం పెద్దదేవాడ వాగు బ్రిడ్జి వద్ద అప్పుడే జన్మించిన నవజాత శిశువును ఓ గుడ్డలో వదిలేసి వెళ్లిపోయారు. అటు నుంచి వెళ్తున్న వాహనదారులు శిశువు ఏడుపును గమనించి పెద్దదేవాడ గ్రామస్తులకు సమాచారం అందించారు. వారు పోలీసులకు సమాచారం అందించడంతో ఎస్సై మోహన్‌రెడ్డి చేరుకొని శిశువును పుల్కల్ పీహెచ్‌సీకి తీసుకెళ్లి ప్రథమ చికిత్స చేయించారు. మెరుగైన వై ద్యం అందించడానికి బాన్సువా డ ఏరి యా ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించారు. అనంతరం ఎస్సై, ఐసీడీఎస్ అధికారులను పిలిపించి కామారెడ్డి బాల రక్షా భవన్ కేంద్రానికి తరలించారు. చికిత్స తర్వాత శిశువు ఆరోగ్యగా ఉందని వైద్యులు తెలిపారు. ఘటనపై పోలీసులు ఆరా తీస్తున్నారు.