
డెయిరీ రంగంలో అనేక అవకాశాలు
కామారెడ్డి అర్బన్: డెయిరీ రంగంలో అనేక ఉపాధి అవకాశాలున్నాయని పీవీ నర్సింహరావు తెలంగాణ వెటర్నరీ విశ్వవిద్యాలయం వైస్ చాన్స్‌లర్ డాక్టర్ ఎం.జ్ఞానప్రకాష్ అన్నారు. శుక్రవారం కామారెడ్డి డెయిరీ కళాశాల ‘ఘృత–2025’ వార్షికోత్సవం స్థానిక కళాభారతిలో నిర్వహించగా ప్రిన్సిపాల్ సురేష్ రాథోడ్ అధ్యక్షత వహించారు. ఈకార్యక్రమానికి ముఖ్య అతిథులు, విశిష్ట అతిథులుగా హాజరైన విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ డాక్టర్ శరత్‌చంద్ర, దొడ్ల డెయిరీ సీఈవో బుసిరెడ్డి వెంకట్‌రెడ్డిలు కళాశాల ప్రత్యేక సావనీర్ ఆవిష్కరించారు. అనంతరం వైస్ చాన్స్‌లర్ మాట్లాడుతూ.. మారుతున్న సాంకేతికతను వినియోగించుకుని అభివృద్ధి చెందాలన్నారు. కామారెడ్డి డెయిరీ కళాశాల పూర్వ విద్యార్థి, దొడ్ల సీఈవో బుసిరెడ్డి వెంకట్‌రెడ్డి తన డెయిరీ ద్వారా సామాజిక బాధ్యతగా రూ.4 కోట్లతో వివిధ అభివృద్ధి పనులు చేపట్టారన్నారు. కళాశాలలో పూర్తి సౌకర్యాలు ఏర్పాడిన పిదప డెయిరీ పీజీ కోర్సులు ప్రారంభిస్తామని వైస్ చాన్స్‌లర్ జ్ఞానప్రకాష్ వెల్లడించారు. దొడ్ల డెయిరీలో దాదాపు 30 మంది కామారెడ్డి డెయిరీ విద్యార్థులకు ఉద్యోగాలు కల్పించినట్టు వెంకట్‌రెడ్డి అన్నారు. రిజిస్ట్రార్ శరత్‌చంద్ర మాట్లాడుతూ.. రాష్ట్రంలోని పలు డెయిరీ కంపెనీలు విద్యార్థులకు వెన్నుదన్నుగా నిలుస్తు ఉపాధి కల్పిస్తున్నాయన్నారు. కళాశాల పూర్వ విద్యార్థి ఎస్వీ కృష్ణారెడ్డి మాట్లాడుతు..డెయిరీ రంగంలో నెలకు రూ.800లతో జీవితాన్ని ప్రారంభించి ప్రస్తుతం ఉన్నత స్థాయిలో ఉన్నానన్నారు. కార్యక్రమంలో అధ్యాపకులు కేఎస్ ఉమాపతి, స్వర్ణలత, పీడీ రవీందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులకు నిర్వహించిన పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. అనంతరం సాంస్కృతిక ప్రదర్శనలు ఇచ్చారు.
వైస్ చాన్స్‌లర్ జ్ఞానప్రకాష్
కామారెడ్డి డెయిరీ కళాశాల
’ఘృత–2025’ వార్షికోత్సవం