
శ్రీ సిద్దరామేశ్వరాలయంలో విచారణ
భిక్కనూరు: దక్షిణ కాశీగా పేరొందిన భిక్కనూరు సిద్దరామేశ్వరాలయంలో పలు అంశాలపై దేవాదాయశాఖ అధికారులు శుక్రవారం విచారణ నిర్వహించారు. విచారణ అధికారిగా నీలకంఠేశ్వరాలయం గ్రేడ్ –1 ఈవో గా పనిచేస్తున్న శ్రీరాం రవీందర్‌ను దేవాదాయశాఖ ఆర్‌జేసీ రామకృష్ణరావు నియమించారు. దీంతో ఆయన శుక్రవారం ఆలయానికి వచ్చి విచారణ నిర్వహించారు. ఆలయంలో అటెండర్‌గా విధులు నిర్వహించిన సత్యనారాయణపై, ఎలక్ట్రిషియన్ గా విధులు నిర్వహించిన బల్యాల లక్ష్మినారాయణపై వచ్చిన అభియోగాలపై విచారణ జరిపారు.ఈనివేదికను ఉన్నతాధికారులకు అందజేస్తానని పేర్కొన్నారు. ఈ విచారణలో ఈవో శ్రీధర్‌తో స్థానికులు పాల్గొన్నారు.
విధుల్లో చేరిన విద్యాశాఖ ఏడీ
కామారెడ్డి టౌన్: జిల్లా విద్యాశాఖ అసిస్టెంట్ డైరెక్టర్‌గా డి. శ్రీనివాస్ శుక్రవారం కలెక్టరేట్‌లోని డీఈవో కార్యాలయంలో విధుల్లో చేరారు. ఈ మేరకు రాష్ట్ర విద్యాశాఖ ఆయన్ని నూతనంగా నియమించింది. మొదటి రోజు దేవునిపల్లిలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన్ని డీఈవో రాజు, ఉపాధ్యాయులు సన్మానించారు.
డీఈవోగా బాధ్యతలు అప్పగించే అవకాశం!
ప్రస్తుతం జిల్లా విద్యాశాఖ అధికారిగా ఎస్. రాజు విధులు నిర్వహిస్తున్నారు. అయితే నూతనంగా రెగ్యూలర్ అసిస్టెంట్ డైరెక్టర్‌గా విధుల్లో చేరిన డి. శ్రీనివాస్‌ను జిల్లా విద్యాశాఖ అధికారిగా బాధ్యతలు అప్పగిస్తూ త్వరలో రాష్ట్ర విద్యా శాఖ నుంచి ఉత్తర్వులు జారీ అయ్యే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.
నేడు సంస్కార భారతి
గురు పూజోత్సవం
కామారెడ్డి అర్బన్: సంస్కార భారతి ఆధ్వర్యంలో శనివారం ఉదయం 10గంటలకు నటరాజ పూజ, గురు పూజోత్సవం నిర్వహించనున్నట్టు సంస్కార భారతి జిల్లా ప్రధాన కార్యదర్శి పాతూరి సత్యప్రసాద్ తెలిపారు.స్థానిక తూర్పు హౌసింగ్ బోర్డు కాలనీలోని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ భవనంలో నిర్వహించే కార్యక్రమానికి ప్రజలు హాజరై విజయవంతం చేయాలని సత్యప్రసాద్ కోరారు.

శ్రీ సిద్దరామేశ్వరాలయంలో విచారణ