
ఘనంగా శబరి మాత పాదుకా పూజ మహోత్సవం
తాడ్వాయి(ఎల్లారెడ్డి) : మండల కేంద్రంలోని కామారెడ్డి–ఎల్లారెడ్డి ప్రధాన రహదారి పక్కన గల శబరి మాత ఆశ్రమంలో గురువారం పాదుకా పూజ మహోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. గురుపౌర్ణమి సందర్భంగా ఉదయం వందలాది భక్తుల మధ్య ధ్వజారోహణ కార్యక్రమంతో ఉత్సవాలను ప్రారంభించారు. వేద పండితులు పాదుకా మహోత్సవ కార్యక్రమాన్ని కనుల పండువగా నిర్వహించారు. అనంతరం మహాత్ములు ఉపన్యాసాలు, ప్రవచనాలు చేశారు. భజన కార్యక్రమాలు చేపట్టారు. భక్తులు భారీగా తరలివచ్చారు. అన్నదానం చేశారు. పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.