
బాధ్యతల స్వీకరణ
● మెడికల్ కళాశాల
ప్రిన్సిపాల్‌గా వాల్య..
● జీజీహెచ్ సూపరింటెండెంట్‌గా
వెంకటేశ్వర్లు
కామారెడ్డి టౌన్: కామారెడ్డి మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్‌గా డాక్టర్ బి వా ల్య, జీజీహెచ్ సూపరింటెండెంట్ గా డాక్టర్ పెరుగు వెంకటేశ్వర్లు గురువారం బాధ్యతలు స్వీకరించారు. మెడికల్ కళాశాల ఆయా విభాగాల హెచ్‌వోడీలు, ప్రొఫెసర్లు, వైద్యులు, ఉద్యోగులు వాల్యకు స్వాగతం ప లికి సన్మానించారు. అలాగే జీజీహెచ్ సూపరింటెండెంట్‌కు ఆస్పత్రి వైద్యులు, సిబ్బంది స్వాగతం పలికి సన్మానించారు.
స్థానిక ఎన్నికల్లో సత్తాచాటాలి
బాన్సువాడ రూరల్ : త్వరలో జరుగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో అత్యధిక స్థానాలు సాధించి బీజేపీ సత్తాచాటాలని ఆ పార్టీ రా ష్ట్ర ఉపాధ్యక్షుడు యెండల లక్ష్మీనారాయణ అన్నారు. తాడ్కోల్‌లోని రెడ్డి సంఘంలో బీ జేపీ జిల్లా అధ్యక్షుడు నీలం చిన్నరాజులు అ ధ్యక్షతన బాన్సువాడ నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశాన్ని గురువారం నిర్వహించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే ల క్ష్యంగా పనిచేయాలని నాయకులకు సూచనలు చేశారు. కేంద్రప్రభుత్వం అమలు చేస్తు న్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించే బాధ్యత ప్రతి కార్యకర్తపై ఉందన్నారు. ఈ సందర్బంగా పార్టీలో చేరిన తా డ్కోల్ మాజీ సర్పంచ్ సాయిలు, బీరుగొండ, రాములు, రమేశ్‌కు కాషాయ కండువా లు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. నాయకు లు పోశెట్టి, లక్ష్మీనారాయణ, దొరబాబు, శంకర్‌గౌడ్, కోనాల గంగారెడ్డి, శ్రీనివాస్, వివిధ మండలాల అధ్యక్షులు, అనుబంధ సంఘాల నాయకులు పాల్గొన్నారు.
ఎంపీడీవోలకు పోస్టింగ్‌లు
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : ఎన్నికలకు ముందు నిజామాబాద్, మెదక్ జిల్లాలకు బదిలీ అయిన ఎంపీడీవోలు ఐదుగురిని కామారెడ్డి జిల్లాకు కేటాయించగా వారికి మండలాల్లో పోస్టింగులు ఇచ్చారు. నిజామాబాద్ జిల్లా ధర్పల్లిలో పనిచేసిన బాలకృష్ణకు రాజంపేట, మెదక్ జిల్లా హవేలీఘన్‌పూర్ నుంచి వ చ్చిన రవీశ్వర్‌గౌడ్‌కు పెద్ద కొడప్‌గల్, శివ్వంపేట నుంచి వచ్చిన నాగేశ్వర్‌కు రామారెడ్డి, మెదక్ నుంచి వచ్చిన రఘుకు పిట్లం, చిలిపి చేడ్ నుంచి వచ్చిన ఆనంద్‌కు బాన్సువాడ మండలాలకు పోస్టింగ్‌లు ఇచ్చారు.
బాధిత కుటుంబాలకు పరామర్శ
భిక్కనూరు: మండలంలోని పెద్దమల్లారెడ్డి, కాచాపూర్ గ్రామాలకు చెందిన పలువురిని బీఆర్‌ఎస్ యువజన విభాగం రాష్ట్ర నాయకుడు గంప శశాంక్ గురువారం పరామర్శించారు. పెద్దమల్లారెడ్డిలో బీఆర్‌ఎస్ కార్యకర్తలు దాచుపల్లి భూమయ్య, మన్నే ప్రమీల, పెద్దోళ్ల దుబ్బవ్వ, కాచాపూర్ గ్రామానికి చెందిన సంతోష్‌రెడ్డి ఇటీవలి కాలంలో మృతి చెందారు. విషయం తెలుసుకున్న గంప శశాంక్ బాధిత కుటుంబాలను పరామర్శించి ఓదార్చరు. ఆయన వెంట మాజీ ఎంపీటీసీ కోడూరి సాయాగౌడ్, నాయకులు ఈర స్వామి, వడ్ల బ్రహ్మచారి, వడ్ల శ్రీనివాస్, డాక్టర్ శ్రీనివాస్, పెద్దోళ్ల అనిల్, ధన్‌రాజు, స్వామి తదితరులు ఉన్నారు.
క్రీడా అకాడమీలో
ప్రవేశాలకు ఎంపికలు
కామారెడ్డి అర్బన్: రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ కొత్తగా ఏ ర్పాటు చేసిన హాకీ, అథ్లెటిక్స్ క్రీడా అకాడమీలలోబాలురు, బాలికల ప్రవేశాలకు ఈ నెల 15, 16 తేదీల్లో హైదరాబా ద్‌లో ఎంపిక లు నిర్వహించనున్నారని జిల్లా యువజన, క్రీడల అధికారి కేఎస్ జగన్నాథన్ ఒక ప్రకటనలో తెలిపారు. 12 నుంచి 16 ఏళ్ల లోపు క్రీడాకారులు వివరాలకు తమ కార్యాలయంలో సంప్రదించాలన్నారు.

బాధ్యతల స్వీకరణ

బాధ్యతల స్వీకరణ

బాధ్యతల స్వీకరణ