
రౌడీషీటర్ గ్యాంగ్ అరెస్ట్
ఖలీల్‌వాడి: నగరంలో కత్తులతో బెదిరించి నగదు వసూలు చేస్తున్న ఓ రౌడీషీటర్ గ్యాంగ్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఒకటో టౌన్ ఎస్‌హెచ్‌వో రఘుపతి బుధవారం తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. జిల్లా కేంద్రానికి చెందిన బర్సాత్ అమీర్ అనే రౌడీషీటర్ తన సభ్యులతో కలిసి గత నెల 7న ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్న షేక్ షారుక్ అనే వ్యక్తి నుంచి డబ్బులు ఇవ్వాలంటు కత్తులతో బెదిరించి దాడి చేసి రూ. 400 నగదును లాక్కున్నారు. దీంతో బాధితుడి ఫిర్యాదు మేరకు రౌడీషీటర్ బర్సాత్ అమీర్‌తో పాటు సభ్యులు మహమ్మద్ షేక్ హసీమ్, ముద్దస్సిర్, షేక్ సుల్తాన్‌పై కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు తెలిపారు. నిందితులను కోర్టులో హాజరు పర్చి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్‌హెచ్‌వో పేర్కొన్నారు.