కుస్తాపూర్‌ నంది పోచంపాడ్‌లో ప్రతిష్ఠాపన | - | Sakshi
Sakshi News home page

కుస్తాపూర్‌ నంది పోచంపాడ్‌లో ప్రతిష్ఠాపన

Jul 10 2025 6:49 AM | Updated on Jul 10 2025 6:49 AM

కుస్త

కుస్తాపూర్‌ నంది పోచంపాడ్‌లో ప్రతిష్ఠాపన

బాల్కొండ: శ్రీరాంసాగర్‌ ప్రాజెక్ట్‌లో ముంపునకు గురైన కుస్తాపూర్‌ రామలింగేశ్వర స్వామి ఆలయం నుంచి నందిని తీసుకొచ్చి పోచంపాడ్‌ శివాలయంలో ప్రతిష్ఠించారు.

● పోచంపాడ్‌లో గోదావరి తీరాన కుస్తాపూర్‌ రామలింగేశ్వర స్వామి ఆలయాన్ని 1969వ సంవత్సరంలో పునఃనిర్మాణం చేపట్టారు.

● శ్రీరాముడు వనవాస కాలంలో కుస్తాపూర్‌ వద్ద బ్రహ్మ హత్య పాపం పోయేందుకు పూజలు చేసినట్లు చరిత్ర చెబుతోంది.

● కుస్తాపూర్‌ వద్ద శ్రీరాముడు ప్రతిష్ఠించిన శివలింగంగా ప్రసిద్ధి చెందింది.

● నాడు ఆలయం ముంపునకు గురి కావడంతో పోచంపాడ్‌ వద్ద తిరిగి పునఃనిర్మించారు. కాగా కుస్తాపూర్‌ నుంచి నందిని మాత్రమే తీసుకొచ్చి నూతన ఆలయంలో ప్రతిష్ఠించినట్లు గ్రామ పెద్దలు పేర్కొంటున్నారు.

● శ్రీరాముడు ఇసుకతో చేసిన శివలింగం ముంపునకు గురైన కుస్తాపూర్‌ ఆలయంలోనే ఉంది.

● ఎస్సారెస్పీ నీటి మట్టం డెడ్‌ స్టోరేజీకి చెరువలో ఉన్నప్పుడు ఆలయం బయల్పడుతుంది. అప్పుడు అక్కడ కూడా భక్తులు పూజలు చేస్తారు.

మీకు తెలుసా?

కుస్తాపూర్‌ నంది పోచంపాడ్‌లో ప్రతిష్ఠాపన 1
1/1

కుస్తాపూర్‌ నంది పోచంపాడ్‌లో ప్రతిష్ఠాపన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement