
యూరియా కొరత లేకుండా చూడాలి
రాజంపేట: యూరియా కొరత లేకుండా చూడాలని భారతీయ కిసాన్ సంఘ్ జిల్లా విత్తన ప్రముఖ్ భైరవరెడ్డి ప్రభుత్వాన్ని కోరా రు. సోమవారం రాజంపేటలోని రైతు వేదికలో బీకేఎస్ మండల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులందరి పంటరుణాలను మాఫీ చేయాలని, రెవెన్యూ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. బీకేఎస్ నూతన కార్యదర్శిగా కృష్ణారెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు సంఘం మండల అధ్యక్షుడు గోపాల్‌రెడ్డి తెలిపారు.
సమస్యల పరిష్కారానికి కృషి
సదాశివనగర్: అర్చకుల సమస్యల పరిష్కా రానికి కృషి చేస్తానని దేవాదాయ శాఖ అసి స్టెంట్ కమిషనర్ విజయ రామారావు పేర్కొ న్నారు. సోమవారం మండల కేంద్రంలోని ఆర్యవైశ్య ఫంక్షన్ హాల్‌లో ఉమ్మడి నిజామా బాద్ జిల్లా ధూపదీప నైవేద్య అర్చక సంఘం ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. మూడు నెలలుగా వేతనాలు ఇవ్వకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని అర్చకులు కమిషనర్‌తో పేర్కొన్నారు. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తానని ఆయన హామీ ఇచ్చారు. కార్యక్రమంలో రెండు జిల్లాల అర్చక సంఘ అధ్యక్షులు అంజనప్ప, రాచప్ప, ఆలయాల కమిటీల చైర్మన్లు బీరయ్య, రవి, రాజయ్య, స్థానిక అర్చకులు సంతోష్‌కుమార్ శర్మ, జంగం గంగాధర్, ప్రసాద్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ ఉమ్మడి జిల్లా
ఇన్‌చార్జీగా అజ్మతుల్లా
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి: గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు కాంగ్రెస్‌ను సంస్థాగతంగా బలోపేతం చేయడానికి ఉమ్మడి జిల్లా కు ఇన్‌చార్జీగా వక్ఫ్ బోర్డు చైర్మన్ అజ్మతుల్లా హుస్సేనీ నియమితులయ్యారు. ఈ మేరకు పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.
అదనపు ఎస్పీ బదిలీ
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి: అదనపు ఎస్పీ నర్సింహారెడ్డి సీఐడీ విభాగానికి బదిలీ అయ్యారు. ఈ మేరకు సోమవారం ఉత్తర్వులు వెలువడ్డాయి. ఆయన స్థానంలో ఎవరికీ పోస్టింగ్ ఇవ్వలేదు.
వైద్య సేవల్లో జిల్లా ఫస్ట్
కామారెడ్డి టౌన్: వైద్య ఆరోగ్యశాఖ పరిధిలోని ప్రభుత్వ ఆస్పత్రులలో ఆయా వైద్యసేవల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయడంలో రాష్ట్రంలోనే జిల్లా ప్రథమ స్థానంలో నిలిచింది. జిల్లాలోని 22 పీహెచ్‌సీలలో గతనెలలో ఓపీ సేవలను 25,152 మంది వినియోగించుకున్నారని జిల్లా వైద్యాధికారి చంద్రశేఖర్ తెలిపారు. ఇందులో 5,232 మంది రోగ నిర్ధారణ పరీక్షలు చేయించుకున్నారన్నారు. 21,539 మంది ఔషధ సేవలు వినియోగించుకున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలోని 33 జిల్లాలలో కామారెడ్డి జిల్లా జూన్ మాసంలో వైద్య సేవలకు సంబంధించి మొదటి స్థానంలో నిలించిందని తెలిపారు.

యూరియా కొరత లేకుండా చూడాలి