
● నాట్లేసి నిరసన
కామారెడ్డి టౌన్: జిల్లా కేంద్రంలోని అశోక్‌నగర్ కాలనీ ప్రధాన రోడ్డు అధ్వానంగా మారింది. రోడ్డు దెబ్బతినడంతో పెద్దపెద్ద గుంతలు ఏర్పడ్డాయి. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ మార్గంలో నూతన రోడ్డు వేయాలని, కనీసం మరమ్మతులైనా చేయాలని కాలనీవాసులు కోరుతున్నా అధికారులనుంచి స్పందన లేదు. ఈ నేపథ్యంలో సోమవారం కాలనీవాసులు రోడ్డుపైన ఏర్పడివన గుంతల్లో వరి నాట్లు వేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ రోడ్డు దెబ్బతిని ఏడాదిన్నర గడిచినా అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. గుంతల దారిలో ప్రయాణించడం కష్టంగా ఉందన్నారు. రోడ్డు సమస్యపై మున్సిపల్ అధికారులతోపాటు కలెక్టర్‌కు విన్నవించినా ఎలాంటి ప్రయోజనం లేదన్నారు. రోడ్డు వేసి, సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ మాజీ కౌన్సిలర్ అర్కల ప్రభాకర్ యాదవ్, కాలనీవాసులు జగదీష్ యాదవ్, శ్రీనివాస్, గంగారాం యాదవ్, దినే ష్‌రెడ్డి, నరేందర్, రాజేష్ తదితరులు పాల్గొన్నారు.