
12న తెరవే ‘పాటకు సలామ్’ కార్యశాల
కామారెడ్డి అర్బన్: తెలంగాణ రచయితల వేదిక(తెరవే) ఆధ్వర్యంలో ఈ నెల 12న యువ గాయని గాయకులను ప్రోత్సహించే ఉద్దేశంతో ‘పాటకు సలామ్’ కార్యశాల కార్యక్రమాన్ని స్థానిక కర్షక్ బీఎడ్ కళాశాలలో ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు నిర్వహించనున్నట్టు తెరవే జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు గఫూర్ శిక్షక్, అల్లి మోహన్‌రాజ్‌లు తెలిపారు. సోమవారం ఏర్పాటు చేసిన సమావేశంలో తెరవే ప్రతినిధులు మట్లాడారు. పాల్గొన్న యువ గాయకులందరికి ప్రశంసాపత్రాలు, మొదటి ముగ్గురు విజేతలకు బహుమతులుంటాయని వారు పేర్కొన్నా రు. ఆసక్తిగల వారు 98490 62038 నంబర్‌కు తమ వివరాలతో పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. తెరవే ప్రతినిధులు కాసర్ల రామచంద్రం, యెంబరి లింగం, వై.గంగాప్రసాద్ పాల్గొన్నారు.
పెండింగ్ చలాన్ల వసూలు
లింగంపేట(ఎల్లారెడ్డి): మండల కేంద్రంలోని పెద్దవాగు వద్ద సోమవారం వాహనాల తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా పెండింగ్‌లో ఉన్న చలాన్లు వసూలు చేసినట్లు ఎస్సై దీపక్ కుమార్ తెలిపారు. అలాగే పలువురికి జరిమానాలు విధించినట్లు తెలిపారు. కానిస్టేబుల్ కనకయ్య, శ్రీనివాస్, రాజు, లక్ష్మణ్, రవి, మదన్‌తో పాటు స్పెషల్ పార్టీ పోలీసులు పాల్గొన్నారు.