
పురుగుల అన్నం మాకొద్దు
ఎల్లారెడ్డి: అన్నంలో పురుగులు వస్తున్నాయని, ఎలా తినాలంటూ ఎల్లారెడ్డి గిరిజన బాలికల గురుకుల పాఠశాల విద్యార్థినులు ఆవేదన వ్యక్తం చేశారు. మెనూ ప్రకారం భోజనం అందించాలని డిమాండ్ చేస్తూ సోమవారం ఎల్లారెడ్డి ప్రధాన రహదారిపై రాస్తారోకో చేపట్టారు. ఈసందర్భంగా విద్యార్థినులు మాట్లాడుతూ.. పాఠశాలలో మెనూ ప్రకారం భోజనం అందించడం లేదని అన్నంలో, జావాలో, శనగలలో పురుగులు వస్తున్నాయన్నారు. ఇంటర్ విద్యార్థులకు బాటనీ లెక్చరర్ లేక ఇబ్బందులు పడుతున్నామని అన్నారు. విషయం తెలుసుకున్న తహసీల్దార్ ప్రేమ్‌కుమార్ ఘటన స్థలానికి చేరుకుని విద్యార్థినులతో మాట్లాడారు. వారిని సముదాయించి, పాఠశాలకు తీసుకువెళ్లారు. విషయం కలెక్టర్‌కు తెలియడంతో వెంటనే అడిషనల్ కలెక్టర్ విక్టర్‌ను విచారణకు పంపారు. ఆయన విద్యార్థులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. విద్యార్థుల సమస్యలను పరిష్కరిస్తామని ఆయన తెలిపారు. పాఠశాలల సమస్యలను పరిష్కరించాలని బంజారా సంఘం నాయకులు అడిషనల్ కలెక్టర్‌కు విన్నవించారు. ఆర్‌సీవో గంగారం, ఎంఈవో రాజులు, మున్సిపల్ కమీషనర్ మహేష్‌కుమార్ తదితరులున్నారు.
దాడి ఘటనలో ఇద్దరి అరెస్టు
భిక్కనూరు: మండలంలోని ఇసన్నపల్లి గ్రామంలో ఇటీవల భూతగాదాల కారణంగా వడ్ల పెద్ద అంజయ్యపై దాడిచేసిన ఇద్దరిని అరెస్టుచేసి రిమాండ్‌కు పంపినట్లు భిక్కనూరు ఎస్సై అంజనేయులు సోమవారం తెలిపారు. అంజయ్యపై దాడి చేసి గాయపరిచిన వడ్ల స్వామితోపాటు ఆయన కుమారుడైన వడ్ల సత్యంను అరెస్టు చేసి రిమాండ్‌కు పంపినట్లు ఎస్సై వివరించారు.
● మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం
అందించాలి
● గిరిజన గురుకుల విద్యార్థినుల డిమాండ్
● ఎల్లారెడ్డి రహదారిపై రాస్తారోకో

పురుగుల అన్నం మాకొద్దు