
రుద్రూర్‌కు ఆ పేరు ఎలా వచ్చిందంటే..
రుద్రూర్: కాకతీయుల కాలంలో రాణీ రుద్రమదేవి వంశీయులు ఈ ప్రాంతాన్ని పరిపాలించినందున గ్రామానికి రుద్రూర్‌గా పేరు వచ్చింది.
● రాణీ రుద్రమదేవికి సంబంధించిన సైనిక స్థావరం రుద్రూర్‌లో ఉండేదని గ్రామపెద్దలు చెబుతున్నారు.
● గ్రామానికి మూడు వైపుల బురుజులు (గడి)లు, ఒక వైపు చెరువు ఉంది. కాల క్రమేణ రెండు అంతరించిపోగా రాతితో నిర్మించిన ప్రధాన ద్వారం చెక్కు చెదరకుండా ఉంది.
● గ్రామం మధ్యలో రాతితో కట్టిన పెద్ద పురాతన కోట (బురుజు) ఉంది. ఇందులో కాకతీయుల సైనిక స్థావరం ఉండేది. ఇక్కడి నుంచి సొరంగ మార్గం (బావి) రుద్రూర్ వ్యవసాయ పరిశోధన కేంద్రం వరకు ఉన్నట్టు గ్రామ పెద్దలు పేర్కొన్నారు.
● కాకతీయుల కాలంలో రాతితో నిర్మించిన రాజరాజేశ్వర ఆలయం ఎంతో ప్రత్యేకతను కలిగి ఉంది.
మీకు తెలుసా?

రుద్రూర్‌కు ఆ పేరు ఎలా వచ్చిందంటే..