
నిషేధిత ప్లాస్టిక్ విక్రయిస్తే దుకాణాలను సీజ్ చేస్తా
కామారెడ్డి టౌన్ : జిల్లా కేంద్రంలో వ్యాపారులు నిషేధిత ప్లాస్టిక్ కవర్లు, బ్యాగులను విక్రయించినా, వినియోగించినా దుకాణాలను సీజ్ చేస్తామని మున్సిపల్ కమిషనర్ రాజేందర్‌రెడ్డి హెచ్చరించారు. శనివారం జిల్లా కేంద్రంలో కొత్తబస్టాండ్, సుభాష్‌రోడ్, సిరిసిల్లారోడ్‌లలో వ్యాపారదుకాణాలు, హోటళ్లను తనిఖీ చేశారు. పలు దుకాణాల్లో నిషేధిత కవర్లు వినియోగించడంతో యజమానులకు జరిమానాలు విధించారు. విక్రయిస్తున్న కవర్లు, క్యారీబ్యాగులను స్వాధీనం చేసుకున్నారు. పర్యావరణ పరిరక్షణకు ప్రజలు, వ్యాపారులు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో సానిటరీ ఎస్‌ఐ పర్వేజ్, జవాన్‌లు పాల్గొన్నారు.
బీసీలకు యూపీఎస్సీ
లాంగ్‌టర్మ్ ఉచిత కోచింగ్
కామారెడ్డి అర్బన్: యూపీఎస్సీ సివిల్స్‌కు ఉచిత లాంగ్ టర్మ్ (ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్) కోచింగ్ కోసం అర్హులై బీసీ అభ్యర్థుల నుంచి ఈనెల 8వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవాలని జిల్లా బీసీ అభివృద్ధి అధికారి బి.స్రవంతి ఒక ప్రకటనలో తెలిపారు. దరఖా స్తు చేసిన వారికి ఈనెల 12న ఆన్‌లైన్ స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుందని, ఎంపికై న వారికి 25 నుంచి వచ్చే సంవత్సరం ఏప్రిల్ 30 వరకు హైదరాబాద్‌లోని సైదాబాద్ లక్ష్మినగర్‌లోని బీసీ స్టడీ సర్కిల్‌లో శిక్షణ ఉంటుందని పేర్కొన్నారు.
నమ్మించి మోసం
చేసిన యువకుడిపై కేసు
మోపాల్: మండలంలోని ముదక్‌పల్లికి చెందిన ఓ మహిళను మోసం చేసిన అస్మత్ ఖాన్ అనే యువ కుడిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై యాదగిరి గౌడ్ శనివారం తెలిపారు. అస్మత్ ఖాన్, గ్రామానికి చెందిన సదరు యువతి గత కొంతకాలంగా ప్రే మించుకుంటున్నారు. అతడు పెళ్లి చేసుకుంటానని తెలపడంతో శారీరకంగా దగ్గరయ్యారు. చివరకు ఆమె గర్భం దాల్చడంతో మాటమార్చాడు. దీంతో బాధిత మహిళ తనను పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడని అతడిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.