
రామారెడ్డిని రక్షించే అష్ట భైరవులు
మీకు తెలుసా?
రామారెడ్డి గ్రామా న్ని పురాతన కాలం నుంచి ఊరు చుట్టూ ఉన్న అష్ట భైరవులు రక్షిస్తుంటారని గ్రామస్తుల ప్రగాడ విశ్వాసం. అష్ట భైరవు లు స్వయంభుగా వెలియగా, కాలక్రమేణ రెండు విగ్రహాలు మాత్రమే పూజలందుకుంటున్నాయి.
● గ్రామంలోని 12ఫీట్ల దిగంబర కాలభైరవుడి విగ్రహానికి ఆలయంతోపాటు నిత్య పూజలందుకుంటుండగా, మరో విగ్రహం కాశిపల్లి కా లభైరవుడిగా పూజలు అందుకుంటున్నాడు. మిగతా విగ్రహాలు కనుమరుగయ్యాయి.
● దేశంలోని కాశీ, కాశ్మీర్, ఉజ్జయిని వంటి ప్రాంతాల్లో అక్కడక్కడ కాలభైరవుడి ఆలయాలు ఉన్నా, ప్రత్యేకంగా ఆలయం ఉన్నది మాత్రం ఇక్కడే.
● స్వామివారికి వైశాఖమాసంలో విశేష కార్యక్రమాలు నిర్వహిస్తారు.
● ప్రతి యేటా కార్తీక బహుళ పంచమి నుంచి నవమి వరకు కాలభైరవుడి జన్మదిన ఉత్సవాలు నిర్వహిస్తారు.
● గతంలో కరువు కాటకాలు వచ్చినప్పుడు గ్రామస్తులందరూ కాలభైరవుడి భయంకర విగ్రహానికి ఆవు పేడ పూసి కానరాకుండా చేయడంతో రెండు మూడు రోజులకే సమస్యలన్నీ పరిష్కారం అయ్యేవి.
● గ్రామాన్ని కాలభైరవుడు రక్షిస్తుండటంతో ప్రజలు భక్తితో పూజలు నిర్వహిస్తూ, అభివృద్ధిలోకి తెచ్చారు.
● స్వామివారికి వామాచార, దక్షిణాచార పద్ధతుల్లో పూజలు నిర్వహిస్తారు.
● ఈ ఆలయం 1978 నుంచి దేవాదాయశాఖ ఆధ్వర్యంలో ఉంది. – రామారెడ్డి
అత్యవసరంలో డయల్ 112
ఖలీల్‌వాడి: రాష్ట్ర ప్రభుత్వం అత్యవసర సేవలన్నింటి కోసం డయల్ 112ను అమలులోకి తీసుకువచ్చింది. డయల్ 100, 108, 101 స్థానంలో 112 సేవలను రాష్ట్రవ్యాప్తంగా అమలులో ఉంటాయి. హైదరాబాద్‌లోని ఇంటిగ్రేటెడ్ పోలీస్ కమాండ్ కంట్రోల్ నుంచి ఈ సేవలను ఆపరేట్ చేస్తారు. సెల్‌ఫోన్ లేదా ఫోన్ నుంచి 112కు కాల్ చేస్తే పోలీస్, ఫైర్‌ర్, మెడికల్, చిల్డ్రన్, ఉమెన్, రోడ్డు ప్రమాదాలకు సంబంధించి అత్యవసర సేవలను ఈ ఒక్క నంబర్ ద్వారా సంప్రదించవచ్చు.
సమాచారం

రామారెడ్డిని రక్షించే అష్ట భైరవులు