
కలుపు నివారణకు మందులు పిచికారీ చేయాలి
మద్నూర్: సోయా పంటలో గడ్డి జాతి కలుపు నివారణకు రైతులు రసాయన మందులు పిచి కారీ చేయాలని ఏవో రాజు అన్నారు. గురు వారం ఆయన వాడి, ఫతేపూర్, మద్నూర్ తదితర గ్రామాల్లో సాగవుతున్న సోయా పంటల ను పరిశీలించి పలు సూచనలు చేశారు. గడ్డిజాతి కలుపు నివారణకు క్విజాలాఫాఫ్ ఈథైల్ 40 ఎంఎల్ లేదంటే ప్రాపాకై ్వజాపాప్ 250ఎంఎల్ మందును 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలన్నారు. వెడల్పాటి ఆకు ఉన్నట్లయితే ఇమజిత్‌పైర్ 400 ఎంల్ పిచికారీ చేయాలన్నారు.అలాగే గడ్డిజాతి,వెడల్పాటి ఆ కు ఉన్నట్లయితే క్విజాలోపాప్ పిఈథైల్,ఇమా జిత్‌పైర్ 200 ఎంల్ మందును ఉదయం పూట గాలి వర్షం లేని సమయంలో భూమిలో తేమ ఉన్న సమయంలో పిచికారీ చేయాలన్నారు.
హెల్మెట్ లేకుండా నడిపితే వాహనాలు సీజ్ చేస్తాం
నిజాంసాగర్(జుక్కల్): హెల్మెట్ లేకుండా ద్విచక్రవాహనాలు నడిపితే సీజ్ చేస్తామని పెద్దకొడప్‌గల్ ఎస్సై మహేందర్ వాహనదారులకు హెచ్చరించారు. గురువారం పెద్దకొడప్‌గల్ మండలంలోని అంజనీ చౌరస్తా జాతీయ రహదారి–161పై వాహనాల తనిఖీ నిర్వహించా రు. ఈ సందర్భంగా ఎస్సై మహేందర్ మాట్లాడుతూ.. రోడ్డుపై వాహనాల సంఖ్య పెరుగుతుందని,మద్యం తాగి,అతివేగంగా వాహనా లు నడపడం వల్ల ప్రమాదాలు సంభవిస్తు న్నాయని పేర్కొన్నారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించాలన్నారు. డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మొబైల్ వాడకం, సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడం, లైసెన్స్ లేకుండా నడుపుతున్నట్లు తెలిస్తే వాహనాలు సీజ్ చేయడమే కాకుండా డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేస్తామని హెచ్చరించారు.
పెండింగ్ చలాన్లు వసూలు
లింగంపేట(ఎల్లారెడ్డి): ముస్తాపూర్‌లో గురువారం ఎస్సై వెంకట్రావు సిబ్బందితో కలిసి వాహనాల తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా పెండింగ్‌లో ఉన్న చలాన్లు రూ.92 వేలు వసూలు చేసినట్లు ఎస్సై తెలిపారు. అలాగే ఒక డ్రంకెన్ డ్రైవ్ కేసు నమోదు చేసినట్లు చెప్పారు. 300 వాహనాలు తనిఖీ చేసి సరైన ధ్రువపత్రాలు, హెల్మెట్ ధరించని 25 మందికి జరిమానాలు విధించినట్లు తెలిపారు.
కృష్ణాజీవాడీలో
అదనపు కలెక్టర్ పర్యటన
తాడ్వాయి(ఎల్లారెడ్డి): కృష్ణాజీవాడీలో గురువారం అదనపు కలెక్టర్ చందర్ నాయక్ పర్యటించారు. మూడు రోజుల క్రితం గ్రామ కార్యదర్శి చంద్రకళ ప్రజల నుంచి ఇంటి పన్నులతో పాటు మిషన్ భగీరథ బిల్లులను వసూల్ చేశారు. దీంతో గ్రామస్తులు కొన్ని సంవత్సరాల నుంచి మిషన్ భగీరథ బిల్లలను చెల్లించలేదని, ఇప్పుడు ఎందుకు వసూల్ చేస్తున్నారని కార్యదర్శిని అడుగడమే కాకుండా పై అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయమై అదనపుకలెక్టర్ చందర్ నాయక్ గ్రామానికి వచ్చి విచారణ చేపట్టారు. గ్రామకార్యదర్శులు, మిషన్ భగీరథ అధికారులు, గ్రామప్రజలు చెప్పిన విషయాలను అదనపు కలెక్టర్ విన్నారు. ఈ సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి సమస్యలు పరిష్కారం అయ్యేలా చూస్తానన్నారు. అప్పటి వరకు మిషన్ భగీరథకు బిల్లులను వసూల్ చేయవద్దని అధికారులకు సూచించారు. డీపీవో మురళీ, ఎంపీడీవో సయ్యద్ సాజీద్‌అలీ, ఏఈలు ప్రశాంత్, శిరీష, ఎంపీవో సవిత, గ్రామకార్యదర్శులు చంద్రకళ, బాలు, రాజు తదితరులు పాల్గొన్నారు.

కలుపు నివారణకు మందులు పిచికారీ చేయాలి

కలుపు నివారణకు మందులు పిచికారీ చేయాలి