
మృత్యువులోనూ వీడని స్నేహం
నిజాంసాగర్: ముగ్గురు స్నేహితులు ఒక బైక్‌పై కలిసి వెళ్లగా, ఘోర రోడ్డు ప్రమాదంలో మృత్యువాతచెందారు. పెద్దకొడప్‌గల్ మండలం జగన్నాథ్‌పల్లి వద్ద గల సంగారెడ్డి–నాందేడ్ 161 జాతీయ రహదారిపై జరిగిన ఘటన వివరాలు ఇలా.. జుక్కల్ మండలం మహమ్మదాబాద్ గ్రామానికి చెందిన పోనుగంటి వెంకటి(22), మంగళి గణేశ్(18), బిచ్కుందకు చెందిన దొడ్లవార్ నవీన్(24) ముగ్గురు స్నేహితులు. గణేశ్ మూడు నెలల కిందట పల్సర్ బైక్ కొనుగోలు చేశాడు. బుధవారం సాయంత్రం వారు ముగ్గురు కలిసి బైక్‌పై పిట్లంకు వెళ్లారు. రాత్రి వేళ ముగ్గురు స్నేహితులు బైక్‌పై నాందేడ్–సంగారెడ్డి జాతీయ రహదారిపై ప్రయాణిస్తుండగా.. అప్పటికే రోడ్డు ప్రమాదానికి గురై, నిలిచి ఉన్న కంటెయినర్‌ను వెనుక నుంచి బలంగా ఢీకొట్టారు. ఈ ఘటనలో ముగ్గురి తలలు పగిలి తీవ్ర రక్తస్రావం జరుగగా, ఇద్దరు ఘటన స్థలంలో మృతిచెందారు. ఒకరు మార్గమధ్యలో మృతి చెందారు. సమాచారం అందుకున్న జాతీయరహదారి సిబ్బంది,పోలీసులు మృతదేహాలను అంబులెన్స్ లో బాన్సువాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
జుక్కల్ మండలం మహమ్మదబాద్ గ్రామానికి చెందిన పొనుగంటి సాయవ్వ–గంగారాం దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. చిన్నకుమారు డైన వెంకటి ఇంటర్ వరకు విద్యను అభ్యసించాడు. తల్లిదండ్రులకు వ్యవసాయ పనుల్లో చేదోడు, వాదో డుగా ఉన్నాడు. అలాగే అదే గ్రామానికి చెందిన మంగళి హన్మండ్లు–లక్ష్మీబాయి దంపతుల పెద్ద కుమారుడు గణేశ్ నిజామాబాద్‌లో ఇంటర్ చదువుతున్నాడు. బిచ్కుంద పట్టణానికి చెందిన దొడ్లవార్ నాందేవ్–శోభ దంపతుల కుమారుడు నవీన్. వీరు ముగ్గురు స్నేహితులు కాగా, చేతికొచ్చిన కుమారులు రోడ్డు ప్రమాదంలో మృతిచెందడంతో వారి కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది.
రోడ్డు ప్రమాదంలో ముగ్గురు
స్నేహితుల మృతి
మూడు కుటుంబాల్లో తీరని విషాదం

మృత్యువులోనూ వీడని స్నేహం

మృత్యువులోనూ వీడని స్నేహం

మృత్యువులోనూ వీడని స్నేహం