
రెవెన్యూ దరఖాస్తుల పరిశీలన
మద్నూర్(జుక్కల్): డోంగ్లీ తహసీల్ కార్యాలయాన్ని బుధవారం అదనపు కలెక్టర్ విక్టర్ సందర్శించి భూభారతి రెవెన్యూ సదస్సులలో వచ్చిన దరఖాస్తులను పరిశీలించారు. దరఖాస్తులను క్షుణ్ణంగా తనిఖీ చేసి సమస్యలను త్వరగా పరిష్కరిస్తామని ఆయన అన్నారు. కార్యాలయ ఆవరణలో ఇందిరమ్మ మోడల్ ఇంటి నిర్మాణాన్ని పరిశీలించి పనులు త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. డోంగ్లీలో మొత్తం 98 దరఖాస్తులు వచ్చాయని అధికారులు అదనపు కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. తహసీల్దార్ ప్రవీణ్‌కుమార్, ఆర్‌ఐ సాయిబాబా, సిబ్బంది ఉన్నారు.