
సాగర్ భూముల పరిరక్షణకు పోరుబాట
నిజాంసాగర్: నిజాంసాగర్ ప్రాజెక్టు భూములను పరిరక్షించాలని మంగళవారం మండల కేంద్రంలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నేతలు ఆందోళనకు దిగారు. బస్టాండ్ వద్ద రాస్తారోకో చేశారు. నిజాంసాగర్ భూ ములను ఇతర ప్రాజెక్టుల ముంపు బాధితులకు కేటాయిస్తుండడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సిద్ధాపూర్ రిజర్వాయర్ నిర్మాణంలో భూములు కోల్పోతున్నవారికి నిజాంసాగర్ భూముల్లో పునరావాసం కల్పించాలన్న నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం బస్టాండ్ నుంచి తహసీల్ కార్యాలయం వరకు ర్యాలీ తీశారు. నిజాంసాగర్ భూములను కాపాడాలంటూ తహసీల్దార్ భిక్షపతికి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నాయకులు మ ల్లికార్జున్, రవీందర్‌రెడ్డి, దుర్గారెడ్డి, గైని విఠల్, న ర్సింహారెడ్డి, రమేష్‌యాదవ్, లోక్యానాయక్ తదితరులు పాల్గొన్నారు.
నిజాంసాగర్‌లో ధర్నా చేస్తున్న
కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నాయకులు
మండల కేంద్రంలో ధర్నా చేసిన
కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నేతలు
తహసీల్దార్‌కు వినతి

సాగర్ భూముల పరిరక్షణకు పోరుబాట