‘మహిళల ఆర్థికాభివృద్ధి కోసమే శిక్షణ’ | - | Sakshi
Sakshi News home page

‘మహిళల ఆర్థికాభివృద్ధి కోసమే శిక్షణ’

May 8 2025 9:10 AM | Updated on May 8 2025 9:10 AM

‘మహిళ

‘మహిళల ఆర్థికాభివృద్ధి కోసమే శిక్షణ’

భిక్కనూరు: మహిళల ఆర్థికాభివృద్ధి కోసమే స్టేట్‌బ్యాంక్‌ ఆప్‌ ఇండియా, ఆర్సెట్‌ సంయుక్తంగా శిక్షణ తరగతులను నిర్వహిస్తున్నాయని జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి ప్రమీల పేర్కొన్నారు. బుధవారం భిక్కనూరులో స్కిల్‌ డెవలప్‌మెంట్‌ తరగతులను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం పొందే విధంగా ప్రణాళికలను రూపొందించుకొని, దాని ప్రకారం సాగాలని సూచించారు. కార్యక్రమంలో మహిళా సాధికారత సంస్థ జిల్లా కోఆర్డినేటర్‌ శిరీష, పంచాయతీ ఈవో మహేష్‌గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

టెర్రరిస్టుల గుండెల్లో దడ

భిక్కనూరు: భారత సైన్యం నిర్వహించిన ఆపరేషన్‌ సిందూర్‌తో టెర్రరిస్టుల గుండెల్లో దడ మొదలైందని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌ అలీ పేర్కొన్నారు. బుధవారం ఆయన తన ఫామ్‌ హౌస్‌లో విలేకరులతో మాట్లాడారు. పాకిస్థాన్‌తోపాటు పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రవాద స్థావరాలే లక్ష్యంగా దాడులు చేసిన భారత సైన్యానికి కృతజ్ఞతలు తెలిపారు. పహల్గాంలో అమాయకులైన పౌరులను పొట్టనబెట్టుకున్న ఉగ్రవాదులకు మన సైన్యం దీటైన జవాబు ఇచ్చిందన్నారు. యావత్‌ భారతదేశం మన సైనికుల వెంట ఉంటుందన్నారు. కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ చంద్రకాంత్‌రెడ్డి పాల్గొన్నారు.

పాస్‌పోర్టు

విచారణలో నిర్లక్ష్యం

హెడ్‌ కానిస్టేబుల్‌పై సస్పెన్షన్‌ వేటు

కామారెడ్డి క్రైం: పాస్‌పోర్టు విచారణలో నిర్లక్ష్యం కనబరిచిన ఓ హెడ్‌ కానిస్టేబుల్‌పై సస్పెన్షన్‌ వేటు పడింది. వివరాలిలా ఉన్నాయి. ప్రస్తుతం మద్నూర్‌ పీఎస్‌లో విధులు నిర్వహిస్తున్న హెడ్‌ కానిస్టేబుల్‌ పి.కృష్ణ ఏడాది క్రితం స్పెషల్‌ బ్రాంచ్‌ విభాగంలో విధులు నిర్వర్తించారు. గతంలో మాచారెడ్డి మండలానికి చెందిన టేకుల రాజయ్య అనే వ్యక్తి పాస్‌పోర్ట్‌ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. పాస్‌పోర్ట్‌ విచారణకు వెళ్లిన హెడ్‌ కానిస్టేబుల్‌ కృష్ణ విచారణలో నిరక్ష్యం వహించాడు. టేకుల రాజయ్యకు ఇంతకుముందు రాజు పేరుతో పాస్‌పోర్టు ఉందన్న విషయం తెలుసుకోకుండా, ప్రాథమిక పరిశీలన లేకుండానే క్లియరెన్స్‌ ఇచ్చాడు. తర్వాత రాజయ్యపై రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌ పోలీసు స్టేషన్‌లో నకిలీ పాస్‌పోర్టు కేసునమోదయ్యింది. ఈ విషయం ఎస్పీ రాజేష్‌ చంద్ర దృష్టికి రావడంతో విచారణ జరిపి ఇన్‌చార్జి డీఐజీ సన్‌ప్రీత్‌ సింగ్‌కు నివేదించారు. దీంతో హెడ్‌ కానిస్టేబుల్‌ పి.కృష్ణను సస్పెండ్‌ చేస్తూ ఇన్‌చార్జి డీఐజీ ఆదేశాలు జారీ చేశారు.

‘మహిళల ఆర్థికాభివృద్ధి కోసమే శిక్షణ’
1
1/1

‘మహిళల ఆర్థికాభివృద్ధి కోసమే శిక్షణ’

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement