
ప్రజావాణికి అధికారులు డుమ్మా
నిజాంసాగర్(జుక్కల్): మహమ్మద్ నగర్ తహసీల్ కార్యాలయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమానికి తహసీల్దార్ సవాయిసింగ్, వ్యవసాయశాఖ ఏవో నవ్య హాజరయ్యారు. మిగితా ఎంపీడీవో అనిత, ఐసీడీఎస్ సూపర్ వైజర్ రాజేశ్వరితో పాటు వివిదశాఖల అధికారులు ప్రజవాణికి గైర్హాజరయ్యారు.
నేడు, రేపు కోర్టు విధులకు దూరంగా న్యాయవాదులు
కామారెడ్డి టౌన్: హైకోర్టు న్యాయ మూర్తి జ స్టిస్ ప్రియదర్శిని, కామారెడ్డి సీనియర్ న్యాయ వాది మోహనరావుల మృతికి సంతాపంగా జిల్లా కోర్టులో మంగళవారం, బుధవారం విధులకు దూరంగా ఉంటున్నట్లు బార్ అసోసియేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నంద రమేష్,సురేందర్‌రెడ్డిలు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. సోమవారం బార్ అసోసియేషన్ భవనంలో జరిపే సంతాప సభకు న్యాయవాదులు హాజరుకావాలని కోరారు.
సైబర్ నేరాలపై అవగాహన
రాజంపేట : మండల కేంద్రంలో సోమవారం కామారెడ్డి పోలీసు కళాబృందం ఆధ్వర్యంలో సైబర్ క్రైం, రోడ్డు ప్రమాదాలపై కళాజాత కార్యక్రమాన్ని నిర్వహించారు. ద్విచక్ర వాహనదారులు తప్పకుండా హెల్మెట్ ధరించాలని, మైనర్లకు వాహనాలు ఇవ్వరాదని, సైబర్ క్రైం నేరాలపై అప్రమత్తంగా ఉండాలని అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఎస్సై పుష్పరాజ్, కళాజాత బృందం సభ్యులు తిరుపతి, ప్రభాకర్, శేషారావ్, సాయిలు పాల్గొన్నారు.
గాలికుంటు నివారణ
టీకాలను వేయించాలి
తాడ్వాయి(ఎల్లారెడ్డి): రైతులు తమ పశువులకు తప్పనిసరిగా గాలికుంటూ వ్యాధి నిరోధక టీకాలను వేయించాలని మండల పశువైద్యాధికారి రమేశ్ అన్నారు. మండలంలోని కరడ్‌పల్లి గ్రామంలో సోమవారం ఆవులు, గేదేలకు గాలికుంటూ నివారణ టీకాలను వైద్య సిబ్బంది వేశారు. కార్యక్రమంలో పాలకేంద్రం అధ్యక్షుడు నారాయణరెడ్డి, వీఎల్‌వో పోచయ్య, జేవీవోలు కొండల్‌రెడ్డి, ప్రేంసింగ్, గోపాల మిత్రలు మహిపాల్‌రెడ్డి, ఎల్లయ్య, కిష్టయ్య, రైతులు పాల్గొన్నారు.

ప్రజావాణికి అధికారులు డుమ్మా

ప్రజావాణికి అధికారులు డుమ్మా