
గుంతల రోడ్డుతో ఇబ్బందులు
మద్నూర్(జుక్కల్): మండలంలోని రూసేగావ్ గేటు నుంచి కోడిచిర వరకు గల బీటీ రోడ్డు పూర్తిగా గుంతల మయంగా మారడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. మండలంలోని రూసేగావ్ గేటు నుంచి చిన్న ఎక్లార మీదుగా కోడిచిర వరకు గల ఆరు కిలోమీటర్ల బీటీ రోడ్డు పూర్తిగా ధ్వంసమైంది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం, అధికారులు స్పందించి నూతన రోడ్డు నిర్మాణ పనులు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.
భిక్కనూరులో తైబజార్ పేరిట అధిక వసూలు
భిక్కనూరు : మండలంలో ఆదివారం జరిగిన సంతలో తైబజార్‌పేరిట అధిక డబ్బులను కాంట్రాక్టర్ మనుషులు వసూలు చేస్తున్నారని కూరగాయల వ్యాపారులు వాపోయారు. ఒక్క గంపకు రూ.15 తీసుకోవాల్సి ఉండగా కాంట్రాక్టర్‌తో పాటు ఆయన సంబంధీకులు రైతు ల వద్ద నుంచి గంపకు రూ. 30 నుంచి రూ. 40 వసూలు చేస్తున్నారు. ఈవిషయంలో రైతులు సంఘటితమై కాంట్రాక్టర్‌తో పాటు ఆయన సంబంధీకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా అయితే భిక్కనూరు సంతకు తాము పండించే కూరగాయలను విక్రయించేందుకు తీసుకరామని రైతులు స్పష్టం చేశారు. సంతలో తాగేందుకు కనీసం నీటి సౌకర్యం కూడా కల్పించలేదని రైతులు కాంట్రాక్టర్‌తో వాగ్వాదానికి దిగారు. గంపకు రూ.15 మాత్రమే చెల్లిస్తామని స్పష్టం చేశారు. అధికంగా టెండర్‌వేసి తమకు ఎందుకు ఇబ్బంది పెడుతున్నారని రైతులు ఆగ్రహించారు. దీంతో పలువురు వారిని సముదాయించి శాంతింపజేశారు.
ఒలింపిక్ సంఘ భవన స్థలాన్ని కాపాడుకుంటాం
నిజామాబాద్‌నాగారం: ఒలింపిక్ సంఘ భవన స్థ లం కోసం కేటాయించిన స్థలాన్ని కాపాడుకుంటా మని సంఘం జిల్లా కార్యదర్శి బొబ్బిలి నర్సయ్య అ న్నారు. ఆదివారం నగరంలోని ముబారక్‌నగర్‌లో ఉన్న ఒలంపిక్ సంఘ భవన స్థలాన్ని సభ్యులతో కలిసి పరిశీలించారు. 2010లో గత ప్రభుత్వం ఖలీల్‌వాడిలో ఉన్న స్టేడియం స్థలానికి బదులు ముబారక్‌నగర్‌లో 7ఎకరాల35 గుంటల స్థలంతో పాటు పక్కనే ఉన్న 700 గజాల స్థలాన్ని సంఘ భవనం కోసం కేటాయించిందని అన్నారు. ఈ స్థలంలో గ తంలో మంత్రి ఉన్న సుదర్శన్‌రెడ్డి మంజూరు చేసిన రూ. 15 లక్షల నిధులతో బేస్మెంట్, పిల్లర్ల వరకు పనులు చేపట్టినట్లు తెలిపారు. కొందరు భూకబ్జాదారులు స్థలాన్ని తమదంటు ఆక్రమణలకు పాల్ప డుతున్నారని అన్నారు. ఎవరైనా స్థలాన్ని కబ్జా చే యాలని చూస్తే సహించేది లేదన్నారు.

గుంతల రోడ్డుతో ఇబ్బందులు