ఒకేచోట అష్టాదశ శక్తి పీఠాలు | - | Sakshi
Sakshi News home page

ఒకేచోట అష్టాదశ శక్తి పీఠాలు

Oct 7 2024 2:36 AM | Updated on Oct 7 2024 2:36 AM

ఒకేచో

ఒకేచోట అష్టాదశ శక్తి పీఠాలు

దేశాయిపేట్‌లో ప్రతిష్ఠించిన అష్టాదశ శక్తిపీఠాల అమ్మవార్లు

అమ్మవారి మండపంలో

18 శక్తి స్వరూపాలు

దేశాయిపేట్‌ గ్రామంలో ఏర్పాటు

దర్శించుకుని తరిస్తున్న భక్తులు

బాన్సువాడ రూరల్‌: దైవ అనుగ్రహం పూర్తిస్థాయిలో ఉన్న భక్తులు మాత్రమే ప్రపంచవ్యాప్తంగా అష్టాదశ శక్తిపీఠాలను దర్శించి తమ మానవజన్మను సార్థకం చేసుకుంటారని పురాణ, ఇతిహాసాలు చెబుతున్నాయి. అయితే అనేక వ్యయ ప్రయాసాలకు ఓర్చి అష్టాదశ శక్తిపీఠాలన్నీంటిని దర్శించుకునే భాగ్యం భక్తులందరికీ కలగదు! అలాంటి భక్తులకు బాన్సువాడ మండలం దేశాయిపేట్‌ గ్రామస్తులు దేవినవరాత్రి ఉత్సవాల్లో భాగంగా చక్కటి అవకాశం కల్పించారు. పురాణాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 108 శక్తిపీఠాలు ఉన్నాయని కొందరు, భారతదేశంలోనే 54 శక్తిపీఠాలు ఉన్నాయని కొందరు చెబుతుంటారు. అయితే ఆది శంకరాచార్యులవారు దర్శించుకుని శ్రీచక్రస్థాపన చేసిన 18 శక్తిపీఠాల్లో కొలువై ఉండే అమ్మవారి ప్రతిరూపాలను స్థానిక హనుమాన్‌ మందిరంలోని దేవీ మండపంలో అమ్మవారితో పాటు ప్రతిష్టించారు. గ్రామస్తులతోపాటు చుట్టుప్రక్కల గ్రామాల ప్రజలు దేశాయిపేట్‌లోని శ్రీదేవి మండపాన్ని దర్శించుకుని శక్తిపీఠాలను దర్శించుకున్న అనుభూతిని పొందుతున్నారు. 25వ వార్షికోత్సవం ప్రత్యేకంగా నిర్వహించాలని భావించి అష్టాదశ శక్తిపీఠాలను ప్రతిష్టించాలని సంకల్పించారు.

దాతల సహకారంతో..

అమ్మవారి ప్రధాన విగ్రహం, శ్రీలంకలో ఉన్న శాంకరి దేవి ప్రతిరూపంతోపాటు 17 శక్తిపీఠాల్లో కొలువైన అమ్మవారి విగ్రహాల ప్రతిరూపాలను ఇచ్చేందుకు దాతలు ముందుకు వచ్చారు. ఈనెల 3 నుంచి 13వ తేదీ వరకు ప్రతిరోజూ అన్నదానం చేసేందుకు భక్తులు పేర్లు నమోదు చేసుకున్నారు. ఉత్సవ విగ్రహంతోపాటు శక్తిపీఠాలపై కొలువై అమ్మవార్ల కు పుస్తమట్టెల సమర్పణకు సైతం భక్తులు పోటీప డి ముందుకు రావడంతో గ్రామానికి చెందిన రామస్వామి ఆధ్వర్యంలో నవరాత్రి ఉత్సవ కమిటీ నవరాత్రులను అంగరంగ వైభవంగా నిర్వహిస్తోంది.

ప్రత్యేక కార్యక్రమాలు..

నవదుర్గా దేవి మండపంలో కలశస్థాపన, నిత్య అగ్నిహోత్రం, నిత్యన్నదానం, లలిత సహస్ర పారాయణం, పుణ్యహవాచన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. వీటితోపాటు కీర్తనలు, హరికథ, ప్రవచనాలు, భక్తిపాటల(ఆర్కెస్ట్రా) కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈనెల 11న శుక్రవారం సామూహిక కుంకుమార్చన, 13న హోమం, పూర్ణాహుతి, అష్టదశ అమ్మవార్త శోభాయాత్ర నిర్వహించనున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు.

కొలువైన అమ్మవార్లు

శాంకరి, కామక్షి, శృంఖల, చాముండి, జోగులాంబ, భ్రమరాంబిక, మహాలక్ష్మి, ఏకవీరిక, మహాకాళి, పురుహూతిక, గిరిజ, మాణిక్యాంబ, కామరూప, మాధవేశ్వరి, వైష్ణవి, మంగళగౌరి, విశాలక్షి, సరస్వతి.

సంప్రదాయానికి పెద్దపీట

నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఈసారి అష్టాదశ శక్తిపీఠాలను ఏర్పాటుచేశాం. సంస్కృతీ సాంప్రదాయాల కు ప్రాధాన్యం ఇస్తున్నాం. సినిమా పాటలు, రికార్డింగ్‌ డ్యాన్సులు నిషేధం., అమ్మాయిలు జీన్స్‌, అబ్బాయిలు షార్ట్‌లు వేసుకుని రావొద్దని నియమం పె ట్టాం. ప్రతిరోజు ఆధ్యాత్మిక కార్యక్రమాలు కొనసా గుతున్నాయి.

– రామస్వామి, పూజారి, దేశాయిపేట్‌

దాతలందరికీ కృతజ్ఞతలు

ఉత్సవాల్లో భాగంగా అష్టాదశ శక్తిపీఠాల ఏర్పాటు, పూ జా కార్యక్రమాలు చాలా ఖ ర్చుతో కూడుకున్నవి. గ్రా మస్తుల సహకారం, దాతల ప్రోత్సాహంతో నవరాత్రి ఉ త్సవాలను ఈసారి చాలా ప్రత్యేకంగా నిర్వహిస్తు న్నాం. గ్రామానికి చక్కటి పేరు వస్తోంది. ప్రతి రోజూ మధ్యాహ్నం క్వింటాల్‌ నుంచి 150 కిలోల బి య్యంతో అన్నదాన కార్యక్రమం కొనసాగుతోంది.

– తుల శ్రీనివాస్‌, దేశాయిపేట్‌

శక్తి పీఠాలు ఒకేచోట..

మండలంలో కొలువైన అమ్మవారి ప్రధాన విగ్రహంతోపాటు అష్టాదశ శక్తిపీఠాల అమ్మవార్లను దర్శించుకోవడానికి ప్రతిరోజూ భవానీ దీక్షాధారులు, భక్తులు తరలి వస్తున్నారు. సాయంత్రం నుంచి రాత్రి వరకు ప్రత్యేక కార్యక్రమాలు ఉంటున్నాయి. దేశంలో ఎక్కడెక్కడో ఉన్న శక్తి పీఠాలను ఒకే దగ్గర చూసి తరలించాలని కోరుతున్నాం.

– గంట చంద్రశేఖర్‌, భక్తుడు, దేశాయిపేట్‌

ఒకేచోట అష్టాదశ శక్తి పీఠాలు1
1/6

ఒకేచోట అష్టాదశ శక్తి పీఠాలు

ఒకేచోట అష్టాదశ శక్తి పీఠాలు2
2/6

ఒకేచోట అష్టాదశ శక్తి పీఠాలు

ఒకేచోట అష్టాదశ శక్తి పీఠాలు3
3/6

ఒకేచోట అష్టాదశ శక్తి పీఠాలు

ఒకేచోట అష్టాదశ శక్తి పీఠాలు4
4/6

ఒకేచోట అష్టాదశ శక్తి పీఠాలు

ఒకేచోట అష్టాదశ శక్తి పీఠాలు5
5/6

ఒకేచోట అష్టాదశ శక్తి పీఠాలు

ఒకేచోట అష్టాదశ శక్తి పీఠాలు6
6/6

ఒకేచోట అష్టాదశ శక్తి పీఠాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement