బల్దియాగా బిచ్కుంద! | - | Sakshi
Sakshi News home page

బల్దియాగా బిచ్కుంద!

Sep 19 2024 2:10 AM | Updated on Sep 19 2024 2:10 AM

బల్ది

బల్దియాగా బిచ్కుంద!

సాక్షి ప్రతినిధి, కామారెడ్డి: జిల్లాలో మరో మున్సిపాలిటీ ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. బిచ్కుంద మండల కేంద్రాన్ని మున్సిపాలిటీగా మార్చేందుకు కసరత్తు జరుగుతోంది. జిల్లా ఏర్పాటయ్యేనాటికి కామారెడ్డి మున్సిపాలిటీ ఒక్కటే ఉండేది. తర్వాత బాన్సువాడను, ఎల్లారెడ్డి మున్సిపాలిటీలుగా ఏర్పాటు చేయడంతో ఆ సంఖ్య మూడుకు చేరింది. జుక్కల్‌ నియోజకవర్గంలోని బిచ్కుంద బల్దియా అంశంపై మూడు, నాలుగేళ్లుగా చర్చ నడుస్తోంది. జుక్కల్‌ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు బిచ్కుందను మున్సిపల్‌ చేయాలని ప్రభుత్వానికి చేసిన వినతి మేరకు కసరత్తు షురూ అయింది. మున్సిపల్‌ ఏర్పాటుకు అవసరమైన జనాభా, విస్తీర్ణం తదితర అంశాలపై అధికారులు పరిశీలన చేస్తున్నారు. 2001 సంవత్సరంలో బిచ్కుంద గ్రామ జనాభా 13,213 ఉండగా, ప్రస్తుతం 17,480 ఉన్నట్టుగా అంచనా వేశారు. గ్రామంలో 3,896 గృహాలు ఉండగా, 10,265 మంది ఓటర్లు ఉన్నారు.

స్థానిక ఎన్నికలకు ముందే..

పంచాయతీతో పాటు మండల, జిల్లా పరి షత్‌ పాలక వర్గా ల పదవీ కాలం ఎప్పుడో ముగిసిపోయి ప్రత్యేకాధికారుల పాలన కొనసాగుతోంది. అయితే ప్రభుత్వం పంచాయతీ ఎన్నికల నిర్వహణకు కసరత్తు చేస్తున్న నేపథ్యంలో మున్సిపల్‌ ఏర్పాటు అంశాన్ని తేల్చాల్సిన పరిస్థితి ఉంది. ఇప్పటికై తే పంచాయతీ ఎన్నికల కోసం అన్ని పంచాయతీలలాగే బిచ్కుందలో ఓటర్ల జాబితాను ప్రకటించారు. మున్సిపల్‌ ఎన్నికలకు మరో మూడునాలుగు నెలల సమయం ఉంది. ఒక వేళ ప్రభుత్వం బిచ్కుందను మున్సిపాలిటీగా ఏర్పాటు చేయాలని భావిస్తే పంచాయతీ ఎన్నికల షెడ్యూల్‌ వెలువడక ముందే ప్రక్రియను పూర్తి చేయాలి. మున్సిపాలిటీ ఏర్పాటయ్యేది కానిది త్వరలో తేలనుంది.

బిచ్కుంద గ్రామ ముఖచిత్రం

జుక్కల్‌ నియోజకవర్గంలో బిచ్కుందతో పాటు పిట్లం వ్యాపార కేంద్రాలుగా అభివృద్ధి చెందాయి. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో ఆయా గ్రామాలకులకు వచ్చి తమకు అవసరమైనవి కొనుగోలు చేస్తుంటారు. బిచ్కుంద జాతీయ రహదారికి దూరంగా ఉండడంతో విస్తరణలో కొంత వెనకబడి ఉంది. పిట్లం మీదుగా జాతీయ రహదారి ఉండడం, హైవే అభివృద్ధిలో భాగంగా బైపాస్‌ రోడ్డు నిర్మించడంతో గ్రామం రోజురోజుకూ విస్తరిస్తోంది. బిచ్కుందతో పాటు పిట్లం మండల కేంద్రంలో రోడ్ల విస్తరణ, సెంట్రల్‌ లైటింగ్‌ పనులు ఇటీవలే మొదలయ్యాయి. వాటి నిర్మాణాలు పూర్తయితే గ్రామాల రూపురేఖలు మారుతాయని భావిస్తున్నారు. అయితే బిచ్కుందను మున్సిపాలిటీగా ఏర్పాటు చేస్తే పురపాలక శాఖ ద్వారా నిధులు ఎక్కువగా వస్తాయని తద్వారా అభివృద్ధి చెందుతుందని భావిస్తున్నారు. ఇదే సమయంలో మున్సిపాలిటీగా మారితే ఇంటి పన్నులు పెరుగుతాయి. ఉపాధి హామీ పథకం దూరమవుతుంది. స్థానిక రాజకీయ నాయకులు మున్సిపల్‌కే పరిమితం అవ్వాల్సి ఉంటుంది. ఎంపీటీసీగా, ఎంపీపీగా, జెడ్పీటీసీగా పోటీ చేసే అవకాశం కోల్పోతారు.

వ్యాపార కేంద్రంగా..

మున్సిపల్‌ ఏర్పాటుకు కసరత్తు

సాధ్యాసాధ్యాలను

పరిశీలిస్తున్న ప్రభుత్వం

గ్రామం అభివృద్ధి చెందే అవకాశం

బల్దియాగా బిచ్కుంద!1
1/1

బల్దియాగా బిచ్కుంద!

Advertisement
 
Advertisement
Advertisement