వడదెబ్బకు ఉపాధి కూలీ మృతి | - | Sakshi
Sakshi News home page

వడదెబ్బకు ఉపాధి కూలీ మృతి

May 22 2026 12:18 AM | Updated on May 22 2026 12:18 AM

గొల్లప్రోలు (పిఠాపురం రూరల్‌): పని చేస్తూండగా వడదెబ్బ తగిలి ఉపాధి కూలీ మృతి చెందిన సంఘటన గొల్లప్రోలు మండలం తాటిపర్తిలో చోటు చేసుకుంది. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. గ్రామంలోని కోదండ రామయ్య చెరువులో గురువారం ఉపాధి పనులు నిర్వహిస్తున్నారు. అక్కడ పని చేస్తున్న రాపర్తి సత్యనారాయణ (63) తనకు నీరసంగా ఉందని, ఇంటికి వెళ్లిపోతానని ఫీల్డ్‌ అసిస్టెంట్‌కు చెప్పాడు. కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించేలోపే మార్గం మధ్యలో మృతి చెందాడు. ఎంపీడీఓ సెలెట్‌ రాజు, ఏపీఓ గంగా భవాని మృతుని ఇంటి వద్దకు వెళ్లి, కుటుంబ సభ్యులను పరామర్శించారు.

Advertisement
 
Advertisement
Advertisement