మాజీ మంత్రి కన్నబాబు
దేశం మొత్తం మీద ఆంధ్రప్రదేశ్‌లోనే పెట్రోల్, డీజిల్ ధరలు ఎక్కువ. ఎన్నికల ముందు పెట్రో ధరలు పెంచేశారని మాట్లాడిన చంద్రబాబు ఇప్పడు ఏ ముఖం పెట్టుకుని ప్రజలకు సమాధానం చెబుతారు. మన రాష్ట్రంలో పెట్రోలు లీటరు రూ.113 దాటిపోయింది. డీజిల్ రూ.100 దాటింది. తమిళనాడు కన్నా పెట్రోల్ మనకు రూ.7 ఎక్కువ. గుజరాత్‌కు మనకు రూ.15 తేడా ఉంది.
సూపర్ సిక్స్ హామీలు
ఏమయ్యాయి
పిఠాపురం కో ఆర్డినేటర్ వంగా గీత
ఎన్నికల ముందు పెట్రో ఉత్పత్తుల ధరలు పెంచే ప్రసక్తే లేదన్నారు. ఎలాంటి అదనపు పన్నుల భారం వేయబోమని చెప్పారు. పై పెచ్చు వ్యాట్ తగ్గిస్తామని గొప్పలకు పోయారు. ఇప్పుడు ఆ హామీలను గాలికొదిలేసి ధరల భారం మోపడం అన్యాయం కాదా. సూపర్ సిక్స్ హామీలు ఏమయ్యాయి. ప్రజలకు కచ్చితంగా సమాధానం చెప్పాల్సిందే.
వెంటనే తగ్గించాలి
కాకినాడ సిటీ కో ఆర్డినేటర్ ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి
పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే తగ్గించాలి. పెట్రో ధరల పెంపుతో నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతాయి. వాటితో సామాన్యులు నలిగిపోతారు. పెంచిన ధరలు రాష్ట్ర ప్రభుత్వమే భరించాలి. దేశంలోనే అత్యధిక ధరలు ఇక్కడ ఉండటం ఎవరి అసమర్థతతో కూటమి ప్రభుత్వం సమాధానం చెప్పాలి.
తండ్రీ కొడుకులు ప్రజలను
వంచించారు
మాజీ మంత్రి తోట నరసింహం
ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన తనయుడు మంత్రి లోకేశ్ ప్రజలను నిలువునా వంచించారు. జగన్‌మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా వున్న సమయంలో స్వల్పంగా పెట్రోల్ డీజిల్ రేట్లు పెరిగితేనే ఎక్కడలేని హంగామా సృష్టించిన తండ్రి, కొడుకులు రాష్ట్రంలో పెట్రోలు, డీజిల్‌పై ఎందుకు అధికఽ ధరలు వసూలు చేస్తున్నారు. నిజమైన బాదుడు ఎలా వుంటుందో చంద్రబాబు ప్రజలకు రుచి చూపించారు.


