మెరుగైన ర్యాంకు సాధిస్తాం | - | Sakshi
Sakshi News home page

మెరుగైన ర్యాంకు సాధిస్తాం

Apr 30 2026 7:43 AM | Updated on Apr 30 2026 7:43 AM

పదో తరగతి ఫలితాల్లో జిల్లా మెరుగైన ర్యాంకు సాధిస్తుందనే నమ్మకం ఉంది. పరీక్షలకు ముందుగా విద్యార్థులకు వంద రోజుల ప్రణాళికను పక్కాగా అమలు చేశాం. ప్రతి విద్యార్థీ ఉత్తీర్ణత సాధించేలా వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నాం. పిల్లలు ఫెయిలైతే తల్లిదండ్రులు తిట్టడం వల్ల ఎలాంటి ప్రయోజనమూ ఉండదు. పదో తరగతి అంటే పెద్ద వయసేమీ కాదు. మరోసారి చదివి ఉత్తీర్ణత సాధించేలా పిల్లల్ని ప్రోత్సహించాలి. ప్రతి ఒక్కరిలోనూ ప్రతిభ దాగి ఉంటుంది. దానిని తల్లిదండ్రులు గుర్తించి పిల్లలను ప్రోత్సహించాలి.

– పిల్లి రమేష్‌,

జిల్లా విద్యాశాఖాధికారి, కాకినాడ

పక్కాగా నిర్వహణ

పదో తరగతి పరీక్షల అన్ని దశలనూ సమర్థవంతంగా నిర్వహించాం. పరీక్ష ప్రారంభం రోజు నుంచీ ఎక్కడా ఏ లోటూ రాకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకున్నాం. మూల్యాంకనం కూడా నిర్ణీత గడువులో పూర్తి చేయగలిగాం.

– రమామణి, అసిస్టెంట్‌ కమిషనర్‌,

ప్రభుత్వ పరీక్షల విభాగం కాకినాడ

Advertisement
 
Advertisement
Advertisement