కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు | - | Sakshi
Sakshi News home page

కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు

Apr 29 2026 7:24 AM | Updated on Apr 29 2026 7:24 AM

డీజిల్‌, పెట్రోల్‌ కొరత లేదని కేంద్రం చెబుతోంది. కానీ, ఆంధ్రాలో మాత్రం 70 శాతం బంకులు మూతబడ్డాయి. ఆయిల్‌ మాఫియాతో కలిసి కూటమి నేతలు కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు. పెట్రోల్‌, డీజిల్‌ పక్కదారి పట్టిస్తున్నారు. ధరలు పెరిగిన తరువాత ఈ నిల్వలను విక్రయించడం ద్వారా రూ.కోట్లు ఆర్జించే ప్రయత్నాల్లో కూటమి నేతలున్నారు. వరి కోతల సమయాన్ని అవకాశంగా చేసుకుని కొంత మంది కూటమి నేతలు బ్లాక్‌ మార్కెట్‌లో డీజిల్‌ విక్రయిస్తున్నారు. ప్రజల కష్టాలు చంద్రబాబు చెవికెక్కడం లేదు. మంత్రులు కనీసం పట్టించుకోకుండా సింగపూర్‌లో షికారు చేస్తున్నారు.

– తోట నరసింహం, మాజీ మంత్రి,

వైఎస్సార్‌ సీపీ కో ఆర్డినేటర్‌, జగ్గంపేట

Advertisement
 
Advertisement
Advertisement