ప్రజల ఇబ్బందులు పట్టవా? | - | Sakshi
Sakshi News home page

ప్రజల ఇబ్బందులు పట్టవా?

Apr 29 2026 7:24 AM | Updated on Apr 29 2026 7:24 AM

అవసరానికి తగ్గట్టుగా డీజిల్‌, పెట్రోలును అందుబాటులోకి తీసుకురావడంలో చంద్రబాబు ప్రభుత్వ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది. డీజిల్‌ లేక రవాణా వాహనాలు నిలిచిపోయి, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోయే ప్రమాదం ఉంది. ఇంధన సంక్షోభం మన రాష్ట్ర ప్రభుత్వ చేతకానితనాన్ని స్పష్టం చేస్తోంది.

– పాకలపాటి సోమరాజు, సీఐటీయూ కార్యదర్శి, ఏలేశ్వరం

బంకు వద్ద పడిగాపులు

నాలుగు రోజులుగా డీజిల్‌ కోసం ఎన్ని బంకుల వద్దకు వెళ్లినా నో స్టాక్‌ బోర్డే దర్శనమిస్తోంది. ఎక్కడైనా డీజిల్‌ ఉన్నా అక్కడ 100 నుంచి 150 వాహనాలుండటంతో ఉదయం నుంచి సాయంత్రం వరకూ పడిగాపులు పడాల్సి వస్తోంది. అంతసేపు వేచి ఉంటే కేవలం 10 లీటర్ల డీజిల్‌ పోస్తున్నారు. ట్రావెల్స్‌ వాహనాలకు కూడా ఎక్కువ డీజిల్‌ కొట్టకపోవడంతో నాలుగు రోజులు ఖాళీగా ఉండాల్సి వచ్చింది. – సుబ్రహ్మణ్యం, ట్యాక్సీ యజమాని

Advertisement
 
Advertisement
Advertisement