జిల్లాలో ఇంధన కొరతపై జరుగుతున్న ప్రచారం అవాస్తవం. తప్పుడు ప్రచారాన్ని నమ్మి, అపోహలకు గురై ఎవ్వరూ ఆందోళన చెందవద్దు. అన్ని బంకుల్లోనూ పెట్రోలు, డీజిల్ నిల్వలు తగినంతగా ఉన్నాయి. సరఫరా యథాతథంగా కొనసాగుతోంది. అన్ని బంకుల వద్ద మండల స్థాయి అధికారులను నియమించి, నిల్వల లభ్యత, అమ్మకాలను నిత్యం పర్యవేక్షిస్తున్నాం. ప్రజలు అవసరానికి మించి అధికంగా ఇంధనాన్ని కొనుగోలు చేయవద్దు. అగ్ని ప్రమాదాలను నివారించేందుకు బాటిళ్లు, క్యాన్ల వంటి లూజ్ కంటెయినర్లలో ఇంధన విక్రయాలను పూర్తిగా నిషేధించాం. పౌర సరఫరాలు, లీగల్ మెట్రాలజీ, వాణిజ్య పన్నుల శాఖల అధికారులతో కూడిన జాయింట్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందాలు ఇంధన రిటైల్ అవుట్‌లెట్లను తనిఖీ చేస్తున్నాయి. ఎవరి వద్దనైనా అక్రమ నిల్వలు, బ్లాక్ మార్కెట్ అమ్మకాలు జరిగినట్లు గుర్తిస్తే వెంటనే 6ఎ కింద కేసులు నమోదు చేసి, కఠిన చర్యలు తీసుకుంటాం.
– జిల్లా పౌర సరఫరాల అధికారి
ఆర్.సత్యనారాయణరాజుతో కలసి కలెక్టరేట్‌లో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో
జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్


