కాలువలో పడి బాలుడి మృతి | - | Sakshi
Sakshi News home page

కాలువలో పడి బాలుడి మృతి

Apr 3 2026 7:20 AM | Updated on Apr 3 2026 7:20 AM

మోతుగూడెం: కాలువలో పడి ఓ బాలుడు మృతి చెందాడు. పోలీసుల కథనం ప్రకారం.. మోతుగూడెం పోలీస్‌ స్టేషన్‌ పరిధి సుకుమామిడి గ్రామానికి చెందిన కుత్తిమ ఆదిలక్ష్మి తన కూతురు, కుమారుడిని అంగన్‌వాడీ కేంద్రానికి పంపి కూలి పనులకు వెళ్లిపోయింది. సాయంత్రం వచ్చి చూడగా, కుమారుడు ఉత్తమ లక్ష్మణ్‌రెడ్డి (4) కనిపించలేదు. దీంతో గ్రామస్తుల సాయంతో వెతకగా ఆ బాలుడు గ్రామ సమీపంలోని కాలువలో నీటిలో తేలాడుతూ కనిపించాడు. ఈ సమాచారాన్ని ఎస్సై నాజీర్‌ హుస్సేన్‌కు తెలపడంతో మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చింతూరుకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

విద్యుదాఘాతానికి

ఎలక్ట్రీషియన్‌ మృతి

ఏలేశ్వరం: విద్యుత్‌ షాక్‌కు గురై ఓ ప్రైవేట్‌ ఎలక్ట్రీషియన్‌ మృతి చెందాడు. స్థానికుల కథనం ప్రకారం.. యర్రవరంలోని లేఅవుట్‌ సమీపంలో విద్యుత్‌ స్తంభం వద్ద గ్రామానికి చెందిన బిరుసు రాజు (40) మరమ్మతులు చేస్తుండగా విద్యుదాఘాతానికి గురయ్యాడు. దీంతో అతను వెంటనే మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కూలి పనులు చేసుకుని జీవనం సాగిస్తున్న రాజు మృతి చెందడంతో ఆ కుటుంబం పెద్ద దిక్కును కోల్పోయింది. రాజు కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని బంధువులు కోరుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement