రత్నగిరిపై రద్దీ | - | Sakshi
Sakshi News home page

రత్నగిరిపై రద్దీ

Mar 21 2026 5:11 AM | Updated on Mar 21 2026 5:11 AM

అన్నవరం: సత్యదేవుని ఆలయానికి శుక్రవారం వేలాదిగా భక్తులు తరలి వచ్చారు. రత్నగిరి పైన, పలు ప్రాంతాల్లోను గురువారం రాత్రి, శుక్రవారం తెల్లవారుజామున పెద్ద సంఖ్యలో వివాహాలు జరిగాయి. ఆ నవ దంపతులు, వారి బంధుమిత్రులకు ఇతర భక్తు లు కూడా సత్యదేవుని దర్శనానికి తరలి రావడంతో ఆలయ ప్రాంగణం, క్యూలు, వ్రత మండపాలు కిటకిటలాడాయి. సుమారు 30 వేల మంది భక్తులు సత్యదేవుని దర్శించుకున్నారు. స్వామివారి ఉచిత దర్శనానికి గంట, అంతరాలయ దర్శనానికి అరగంట పట్టింది. వివిధ విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.30 లక్షల ఆదాయం సమకూరింది. సత్యదేవుని వ్రతాలు రెండు వేలు జరిగాయి. శని, ఆదివారాలు కూ డా రత్నగిరిపై రద్దీ ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ రెండు రోజుల్లో సుమారు 50 వేల మంది భక్తులు వస్తారనే అంచనాతో ఏర్పాట్లు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement