గ్యాస్‌ కొరతతో మహిళల ఇక్కట్లు | - | Sakshi
Sakshi News home page

గ్యాస్‌ కొరతతో మహిళల ఇక్కట్లు

Mar 19 2026 8:20 AM | Updated on Mar 19 2026 8:20 AM

సామర్లకోట: గ్యాస్‌ కొరతతో సామాన్య, మధ్య తరగతి మహిళలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని రాష్ట్ర అయ్యరక కార్పొరేషన్‌ మాజీ చైర్‌పర్సన్‌ ఆవాల రాజేశ్వరి అన్నారు. బుధవారం ఆమె స్థానిక విలేకరులతో మాట్లాడుతూ సిలిండర్‌ అయిపోయి 10 రోజులు దాటినా గ్యాస్‌ రాక ఏమి చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నారన్నారు. గ్యాస్‌ ఏజెన్సీలకు బుకింగ్‌ కోసం ఫోన్‌ చేస్తే ఆ నంబర్లు పని చేయడం లేదన్నారు. దాంతో గ్యాస్‌ ఏజెన్సీల వద్దకు వెళ్లి బుకింగ్‌ కోసం పడిగాపులు పడవలసి వస్తోందన్నారు. గ్యాస్‌ ఏజెన్సీ నిర్వాహకులను ప్రశ్నిస్తే గ్యాస్‌ సరఫరా లేక పోవడం వలనే ఈ సమస్య ఏర్పడుతోందని చెబుతున్నారని తెలిపారు. అధికారులు మొక్కుబడిగా తనిఖీలు చేస్తూ చేతులు దులుపుకొంటున్నారని ఆరోపించారు. గ్యాస్‌కు బ్లాక్‌ మార్కెట్‌ లేకుండా అందరికీ సకాలంలో అందేలా ఏర్పాట్లు చేయాలని డిమాండ్‌ చేశారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో 20,12, 985 కనెక్షన్లు ఉండగా రోజు వారీ వినియోగం 38వేల సిలిండర్ల వరకు ఉంటుందన్నారు. ప్రస్తుతం రోజుకు 10వేల సిలిండర్లు మాత్రమే సరఫరా చేయగలుగుతున్నారని అన్నారు. క్షేత్రస్థాయిలో ఉన్న వాస్తవాలను మరుగునపెట్టి గ్యాస్‌ కొరత లేదంటూ అమాయక మహిళలను మభ్యపెట్టేలా ప్రభుత్వం ప్రచారాలు చేయడం దుర్మార్గమన్నారు.

అయ్యరక కార్పొరేషన్‌ మాజీ చైర్‌పర్సన్‌ రాజేశ్వరి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement