కాకినాడ క్రైం : దివ్యాంగ శక్తి పథకాన్ని కలెక్టర్ షణ్మోహన్ కాకినాడ ఆర్‌టీసీ బస్టాండ్‌లో బుధవారం ప్రారంభించారు. జిల్లా ప్రజా రవాణాధికారి శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ 40 శాతం వైకల్యం కలిగిన ప్రతి ఒక్కరికీ ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పించినట్లు తెలిపారు. సహాయకులకు 50 శాతం రాయితీ కల్పిస్తున్నామన్నారు. 21 రకాల అంగవైకల్యాలున్నవారికి ఈ సదుపాయం అందుబాటులో ఉంటుందన్నారు. పల్లెవెలుగు, అల్ట్రా పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో ప్రయాణం ఉచితం కాగా, ఏసీ, డీలక్స్ బస్సుల్లో 50 శాతం రాయితీతో ప్రయాణించవచ్చన్నారు. ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే ఎస్‌వివిఎస్‌ఎన్ వర్మ పాల్గొన్నారు. కలెక్టర్ ఆర్‌టీసీ బస్టాండ్ నుంచి కలెక్టరేట్ వరకు దివ్యాంగులతో కలిసి ప్రయాణం చేసి వివేకానంద హాల్లో వారితో కలిసి భోజనం చేశారు.


