మాక్వేరి విశ్వవిద్యాలయంతో ‘ఆదిత్య’ ఒప్పందం | - | Sakshi
Sakshi News home page

మాక్వేరి విశ్వవిద్యాలయంతో ‘ఆదిత్య’ ఒప్పందం

Feb 21 2026 6:59 AM | Updated on Feb 21 2026 6:59 AM

మాక్వేరి విశ్వవిద్యాలయంతో ‘ఆదిత్య’ ఒప్పందం

మాక్వేరి విశ్వవిద్యాలయంతో ‘ఆదిత్య’ ఒప్పందం

గండేపల్లి: సూరంపాలెం ఆదిత్య విశ్వవిద్యాలయం ఆస్ట్రేలియాలోని మాక్వేరి విశ్వవిద్యాలయంతో డ్యూయల్‌ డిగ్రీ అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఆదిత్య డిప్యూటీ ప్రో చాన్సలర్‌ ఎం.శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆదిత్య అండర్‌ గ్రాడ్యుయేట్‌ అధ్యయనాల మొదటి, రెండు సంవత్సరాలు ఆదిత్యలో, మిగతా రెండేళ్లు ఆస్ట్రేలియాలోని మాక్వేరి విశ్వవిద్యాలయంలో చదవాల్సి ఉంటుంన్నారు. విద్య, క్రెడిట్‌ అవసరాలను విజయవంతంగా పూర్తి చేసిన అనంతరం విద్యార్థులకు రెండు విశ్వవిద్యాలయాల నుంచి డిగ్రీ ప్రదానం చేస్తామన్నారు. విద్యార్థులు ఫ్రేమ్‌వర్క్‌ కింద ఆదిత్య నుంచి బీటెక్‌ డిగ్రీ, సంబంధిత స్పెషలైజేషన్‌లో మాక్వేరి విశ్వవిద్యాలయం నుంచి బ్యాచిలర్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌ (ఆనర్స్‌) డిగ్రీతో పట్టభద్రులవుతారన్నారు. ఈ అవగాహన ఒప్పందంలో ఆదిత్య నుంచి ప్రో చాన్సలర్‌ ఎన్‌.సతీష్‌రెడ్డి, వైస్‌ చాన్సలర్‌, ప్రొఫెసర్‌ ఎంబీ శ్రీనివాస్‌, అంతర్జాతీయ సంబంధాల డీన్‌ ప్రొఫెసర్‌ ఎస్‌.రంజిత్‌.పి, అడ్మినిస్ట్రేషన్‌ డీన్‌ ప్రొఫెసర్‌ సత్యనారాయణ వెల్ల, మాక్వేరి తరఫున ప్రో వైస్‌ చాన్సలర్‌ లీ ఆన్‌ నోరిస్‌, ఎగ్జిక్యూటివ్‌ డీన్‌ ప్రొఫెసర్‌ శామ్యూల్‌ ముల్లర్‌, అసోసియేట్‌ డీన్‌ ప్రొఫెసర్‌ రే ఈటన్‌, డైరెక్టర్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ ప్రొఫెసర్‌ శామ్యూల్‌ ముల్లర్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement