కోట నృత్య కళాకారులకు గిన్నిస్‌లో చోటు
సామర్లకోట: స్థానిక చిన్నారి నృత్య కళాకారులు గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించారు. హైదరాబాద్‌కు చెందిన భారత్ ఆర్ట్ ఆకాడమీ ఆధ్వర్యంలో గచ్చిబౌలి స్టేడియంలో ఏడు వేల నృత్య కళాకారులతో కూచిపూడి కళా వైభవాన్ని నిర్వహించి ఈ రికార్డు సాధించారు. ఆ బృందంలో సామర్లకోటకు చెందిన 30 మంది చిన్నారులు పాల్గొన్నారు. నాట్యాచార్యుడు బేత సత్యనారాయణ వద్ద వారు నృత్యాన్ని అభ్యసించారు. శనివారం సాయంత్రం హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో తెలంగాణ మంత్రి, ప్రముఖుల సమక్షంలో వారికి గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్‌ుడ్స ప్రతినిధులు సర్టిఫికెట్లు అందుకున్నారు. ఆదివారం పట్టణ ప్రముఖులు ఆ చిన్నారులను అభినందించారు.


