మహిళల ఆశలు నీరుగార్చారు
చంద్రబాబు ప్రభుత్వానికి ప్రజా సంక్షేమ పట్ల ముఖ్యంగా మహిళా పథకాలు అమలు చేయడంలో చిత్తశుద్ధి లేదు. సూపర్ సిక్స్ హామీల్లో ఒకటైన ఆడబిడ్డ నిధి పథకం కింద నెలకు రూ.1,500 ఇస్తామన్న హామీ ఏడాదిన్నర అవుతున్నా అమలు కాలేదు. అనేక కొర్రీలతో కుట్టు శిక్షణ పొందిన మహిళలకు నేటికీ మెషీన్లు ఇవ్వకపోడం దారుణం. వారు ఈ శిక్షణ ద్వారా ఆర్థికంగా నిలదొక్కుకోగలం అని ఆశించారు. ఆలస్యం కావడంతో వారు వేరే ఉపాధి మార్గాలను వెతుక్కోవలసిన పరిస్థితి ఏర్పడింది. మహిళల ఆశలను ప్రభుత్వం నీరుగార్చింది.
– గూడపాటి రమాదేవి,
జెడ్పీటీసీ సభ్యురాలు, కొత్తపేట
మహిళల స్వయం ఉపాధిలో భాగంగా కుట్టు మెషీన్ల ద్వారా జీవనోపాధి పొందుతూ, కుటుంబ ఆర్థికాభివృద్ధికి దోహదపడేలా చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యం. అందుకు సంక్షేమ పథకాల అమలులో భాగంగా ఉచిత కుట్టు శిక్షణ ఇచ్చాం. అయితే ప్రభుత్వంలో కొన్ని బిల్లులు పండింగ్ ఉన్నాయి. అవి క్లియర్ అయ్యాక మెషీన్లను పంపిణీ చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. అర్హులైన అందరికీ మెషీన్లు ఇస్తాం.
– ఎ.శ్రీనివాసరావు, ఈడీ,
బీసీ కార్పొరేషన్, కాకినాడ


