
నకిలీ మద్యంపై నేడు నిరసనలు
వైఎస్సార్ సీపీ నేత కురసాల కన్నబాబు
కాకినాడ రూరల్: నకిలీ మద్యం తయారీ, అమ్మకాలు, బెల్టు షాపులకు వ్యతిరేకంగా వైఎస్సార్ సీపీ ఆధ్వర్యాన అన్ని నియోజకవర్గాల్లోనూ నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు ఆ పార్టీ ఉత్తరాంధ్ర జిల్లాల రీజినల్ కో ఆర్డినేటర్, మాజీ మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు. కాకినాడలోని తన క్యాంపు కార్యాలయంలో ఆదివారం ‘సాక్షి’తో మాట్లాడారు. కూట మి నాయకుల అండదండలతో నకిలీ మద్యం తయారీ, బెల్టు షాపుల నిర్వహణ జోరందుకున్నాయన్నారు. రాష్ట్రంలోని ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతూ నకిలీ మద్యం తయారీ, అమ్మకాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి వ్యతిరేకంగా ఎకై ్సజ్ స్టేషన్ల ఎదుట వైఎస్సార్ సీపీ చేపట్టే నిరసన కార్యక్రమాల్లో పార్టీ శ్రేణులతో పాటు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరా రు. కాకినాడలో నాగమల్లితోట సమీపాన ఎకై ్సజ్ ఉప కమిషనర్ (డీసీ) కార్యాలయం వద్ద ఉద యం 10.30 గంటలకు శాంతియుతంగా నిరసన తెలియజేస్తామన్నారు. నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొనాలని కన్నబాబు కోరారు.
తలుపులమ్మ సన్నిధిలో రద్దీ
తుని రూరల్: వివిధ జిల్లాల నుంచి వచ్చిన 10 వేల మంది భక్తులు ఆదివారం తలుపులమ్మ అమ్మవారిని దర్శించుకున్నారని ఆలయ ఈఓ పెన్మెత్స విశ్వనాథరాజు తెలిపారు. లడ్డూ, పులిహోర ప్రసాదాల విక్రయం ద్వారా రూ.1,83,165, పూజా టికెట్లకు రూ.1,76,300, కేశఖండన శాలకు రూ.13,440, వాహన పూజలకు రూ.6,800, వసతి గదులు, పొంగలి షెడ్లు, కాటేజీల అద్దెలు రూ.81,572, విరాళాలు రూ.65,135, వెరసి మొత్తం రూ.5,26,412 ఆదాయం వచ్చిందని వివరించారు.

నకిలీ మద్యంపై నేడు నిరసనలు