
భయాందోళనలు చెందుతున్నాం
గ్రామంలో 60–70 టన్నుల లోడుతో లారీలు వేగంగా వెళ్తున్నాయి. దీంతో, ఎప్పుడే ప్రమాదం ముంచుకొస్తుందోనని భయాందోళనకు గురవుతున్నాం. మోటార్లతో ఇసుక తవ్వి తరలించేస్తున్నారు. దీనివల్ల స్థానికంగా ఇళ్లు నిర్మించుకునే వారికి ఇసుక దొరకని పరిస్థితి ఏర్పడుతుంది.
– మోర్త తాతారావు, సోమవరం
ప్రమాదంలో ఎత్తిపోతల పథకం
సోమవరంలోని ఎత్తిపోతల పథకం పంపు సమీపంలో యథేచ్ఛగా ఇసుక తోడేస్తున్నారు. దీనివల్ల పంపింగ్ స్కీమ్ కూలిపోయే ప్రమాదం ఉంది. ఇదే జరిగితే సుమారు 1,200 ఎకరాలు బీడుగా మారిపోయే ప్రమాదం ఉంది. ఇంత జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. అక్రమ ఇసుకతో సొమ్ము చేసుకుంటున్న నాయకులు.. రైతుల సమస్యలను కూడా పట్టించుకోవాలి.
– అడబాల నాగరాజు, సోమవరం

భయాందోళనలు చెందుతున్నాం