
కౌశల్ పోటీలను విజయవంతం చేయండి
బాలాజీచెరువు (కాకినాడ సిటీ): ప్రభుత్వ యాజమాన్య పాఠశాలల్లోని విద్యార్థులు కౌశల్ రాష్ట్ర స్థాయి సైన్స్ ప్రతిభాన్వేషణ పోటీల్లో పాల్గొని జయప్రదం చేయాలని జిల్లా విద్యాశాఖాధికారి పిల్లి రమేష్ కోరారు. పోటీలకు సంబంధించిన వాల్‌పోస్టర్లను మంగళవారం తన చాంబర్‌లో ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, భారతీయ విజ్ఞాన మండలి, సైన్స్ సిటీ ఆఫ్ ఏపీ, రాష్ట్ర శాస్త్ర, సాంకేతిక మండలి ఆధ్వర్యాన ఈ పోటీలు జరుగుతున్నాయన్నారు. జిల్లా, రాష్ట్ర స్థాయి విజేతలకు నగదు బహుమతులు అందిస్తారన్నారు. ఈ నెల 23లోగ ఆన్‌లైన్‌లో విద్యార్థుల వివరాలు నమోదు చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా సైన్స్ అధికారి ఎం.శ్రీనివాస్ వినీల్, కౌశల్ జిల్లా సమన్వయకర్త కేసరి శ్రీనివాసరావు, జాయింట్ కో ఆర్డినేటర్ పి.మోహన్‌రెడ్డి, ఏపీ ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షుడు ఎస్.చలపతి, ప్రధాన కార్యదర్శి సీహెచ్‌ఎన్ శ్రీనివాస్, వీవీఎం జిల్లా సమన్వయకర్త డి.శివప్రసాద్ పాల్గొన్నారు.
ఫ క్విజ్ పోటీలు 8, 9, 10 తరగతుల వారికి ఉంటాయి. నవంబర్ 1, 2, 3 తేదీలలో పాఠశాల స్థాయిలో నిర్వహించే ఈ పోటీలకు తరగతికి ముగ్గురు చొప్పున మాత్రమే పాల్గొనాలి.
ఫ తొమ్మిదో తరగతి వారు పోస్టర్–1, ఎనిమిదో తరగతి వారు పోస్టర్–2 పోటీలకు అర్హులు.
ఫ రీల్స్ పోటీలకు 10వ తరగతి విద్యార్థులు మాత్రమే అర్హులు.
ఫ పోటీల్లో పాల్గొన్న వారిలో పాఠశాల స్థాయిలో ప్రతి తరగతి నుంచి మూడు విభాగాల్లో ఇద్దరు చొప్పున విజేతలను జిల్లా స్థాయికి ఎంపిక చేస్తారు. వారి నుంచి ప్రతి ఈవెంట్‌కు ఇద్దరు చొప్పున రాష్ట్ర స్థాయికి వెళ్తారు. రాష్ట్ర స్థాయి పోటీలు డిసెంబర్ 27న తిరుపతి భారతీయ విజ్ఞాన జాతీయ సమ్మేళనంలో జరుగుతాయి.